బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలి
అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్
నిర్మల్‌రూరల్ : దేశంలో, రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినా తమ సమస్యలు తీరలేదని, ఇక బహుజనులే రాజ్యాధికారం చేపట్టాల్సిన అవసరముందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ అన్నారు. స్థానిక టీఎన్జీవోస్ సంఘభవనంలో బుధవారం పార్టీ నిర్మల్ అసెంబ్లీ అధ్యక్షుడు బొర ముత్యం అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పదాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా పదాధికారులతో ప్రస్తుత పరిస్థితులు, చేపట్టాల్సిన అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా తమకు ఒరిగిందేమి లేదని, ఇక సమస్యలను పరిష్కరించుకోవాలంటే బహుజనులే రాజ్యాధికారం చేపట్టాలని అన్నారు. సమావేశంలో బామ్సెఫ్ జిల్లా కన్వీనర్ మార రాజన్న, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ పట్ల బాపురావు, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు, శేర్లింగంపల్లి అసెంబ్లీ అధ్యక్షుడు హన్మంత్‌రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నేర రాజన్న, పాముల బాపురావు, సుంకరి సాయన్న, మర్సకోల భీంరావు, మల్లెల భూమన్న, దేవోళ్ల రాజలింగం, లింగన్న, సదానందం తదితరులు పాల్గొన్నారు.