Ram murthy
-
తమ్ముడి మృతదేహానికి నివాళులర్పించిన చంద్రబాబు
-
రామ్మూర్తినాయుడూ బాబు బాధితుడే
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు మరణంతో అన్నదమ్ముల బంధంపై ఎల్లో మీడియా అదేపనిగా ప్రచారం చేస్తోంది. కానీ.. రామ్మూర్తినాయుడిని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని ఆయనతో కలిసి పనిచేసిన ఓ మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాలుగు సార్లు సీఎంగా పనిచేసినా రామ్మూర్తినాయుడిని చంద్రబాబు ఆర్థికంగా ఆదుకోలేదని ఆ మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. తమ్ముడిని రాజకీయంగానూ చంద్రబాబు ఎదగనీయలేదని, ఈ విషయాన్ని రామ్మూర్తినాయుడే పలు సందర్భాల్లో తనతో చెప్పారని 1994లో రామ్మూర్తినాయుడికి సహ ఎమ్మెల్యేగా ఎన్నికైన మరో మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.ఆయనకు ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లి చంద్రగిరి సీటు ఇప్పించింది లక్ష్మీపార్వతి అని పేర్కొన్నారు. టీడీపీలోనే ఉన్నా తమ్ముడికి సీటు ఇవ్వడాన్ని అప్పట్లో చంద్రబాబు వ్యతిరేకించారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పేవారని వివరించారు. 1995లో ఎన్టీఆర్ మరణం తర్వాత వెన్నుపోటు రాజకీయాలతో చంద్రబాబు టీడీపీని చేజిక్కించుకున్న తరువాత రామ్మూర్తినాయుడిని పట్టించుకోలేదని, 1999 ఎన్నికల్లో తమ్ముడికి సీటు ఇచ్చినా ఆయన గెలిచేందుకు సహకరించలేదని పేర్కొన్నారు.ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయినా తమ్ముడిని, ఆయన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారని చెప్పారు. ఆ సమయంలోనే అనేకసార్లు చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని, రాజకీయంగా అణచివేస్తున్నాడని రామ్మూర్తినాయుడు సన్నిహితులు, మీడియా వద్ద చెప్పుకుని బాధపడేవారని ఆ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా.. రామ్మూర్తినాయుడు మానసిక స్థితి బాగోలేకపోవడంతో ఆయన్ను గొలుసులతో కట్టేశారంటూ అప్పట్లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.అన్నపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరికఈ బాధతోనే రామ్మూర్తినాయుడు 2004 ఎన్నికల్లో అన్న చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి కాంగ్రెస్‌లో చేరారు. చంద్రబాబుకు కుటుంబం అన్నా కనీస గౌరవం లేదని, బాధ్యత కూడా లేదని రామ్మూర్తినాయుడు అనేవారు. ఆయనకు రాజకీయమే ముఖ్యమని, అందుకోసం ఏదైనా చేస్తాడని చెప్పేవారు. తన కుటుంబాన్ని తానే చూసుకునేవాడినని అందువల్లే చంద్రబాబు రాజకీయాల్లో రాణించగలిగారని పలు ఆయన సందర్భాల్లో తెలిపారు.రాజకీయంగా ఎదిగిన తర్వాత హెరిటేజ్ తదితర చాలా ఆస్తులు సంపాదించినా తమ్ముడు సహా తన అక్క, చెల్లెలు గురించి చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని రామ్మూర్తి సహచరులు చెప్పారు. 2008 నుంచి అనారోగ్యంతో రామ్మూర్తినాయుడు మంచానపడ్డారు. ఆ తర్వాత ఆయన కుమారుడు నారా రోహిత్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపారు. 2014 ఎన్నికల్లో కుప్పం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అతన్ని కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి రానివ్వలేదని చెబుతారు. -
55 కేజీ విజేత రామ్మూర్తి
హుడా కాంప్లెక్స్, న్యూస్‌లైన్: జాతీయ స్థాయి జూనియర్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో 55 కేజీ విభాగంలో రామ్మూర్తి విజేతగా నిలిచాడు. జ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగాయి. 55, 60, 65, 70, 75, 80, 85 కేజీ విభాగాల్లో మిస్టర్ ఇండియా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పాటు తెలంగాణ నుంచి పలువురు బాడీబిల్డర్లు పాల్గొన్నారు. 55 కేజీ విభాగంలో మొదటి స్థానం దక్కించుకున్న రామ్మూర్తి (తమిళనాడు)కి హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముద్దగౌని రాంమోహన్‌గౌడ్ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్‌మోర్, కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయ చైర్మన్ సుదర్శన్ యాదవ్, తెలంగాణ అమెచ్యూర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బెన్ని ఫ్రాన్సిస్, నర్సింగంరెడ్డి, పి.మల్లారెడ్డి, సలీం, దయానిధి, శ్రీనివాస్, సంజీవ్, కె.శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.