‘ఖైదీ’ టికెట్ కావాలంటూ వీరంగం
విశాఖపట్నం: చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 సినిమా విడుదల కావడంతో ప్రతి చోటా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అభిమానులు బాణసంచా కాల్చి కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో విశాఖలోని రామా టాకీస్ వద్ద మాత్రం ఓ యువకుడు సినిమా టికెట్ కావాలంటూ నానా హంగామా సృష్టించి ఒంటిపై బ్లేడుతో గాయపరుకున్న సంఘటన కలకలం రేపింది. వెంటనే తేరుకున్న థియేటర్ యాజమాన్యం అతడిని ఆస్పత్రికి తరలించేందుకు యత్నించింది. అయినా అతను మొండిగా, మూర్ఖంగా ప్రవర్తిస్తూ సినిమా టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానంటూ అందరినీ హడలెత్తించాడు. చివరకు పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.