ramadan wishes
-
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
-
రంజాన్ నెల ప్రారంభం.. ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ మాసంలో.. నెల రోజులపాటు నియమ నిష్టలతో ముస్లింలు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తోందని చెప్పారు. ‘కఠిన ఉపవాస దీక్ష (రోజా) ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దాన ధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్. ఈ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు’ అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంవో గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
దర్శనమిచ్చిన నెలవంక
సాక్షి, హైదరాబాద్: రంజాన్ నెలవంక శుక్రవారం దర్శనమిచ్చిందని రుహియ్యతే హిలాల్ కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్ పాషా ప్రకటించారు. నెలవంక దర్శనమివ్వడంతో శనివారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించవచ్చన్నారు. లాక్డౌన్ దృష్ట్యా ముస్లింలు రంజాన్ ఆరాధనలు తమ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐదు పూటల నమాజ్తో పాటు ఇఫ్తార్, తరావీ నమాజ్లను ఇళ్లలో చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్తో చరిత్రలో తొలిసారి రంజాన్ సామూహిక ప్రార్థనలు మసీదుల్లో జరగడం లేదు. సీఎం రంజాన్ శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సామరస్యం, సోదరభావం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా ప్రజలు ఇళ్ల వద్దే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, రంజాన్ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. కంటైన్మెంట్ జోన్లలో ఉండే ముస్లింలకు అవసరమైన సరుకులు అందించడం, ఇతర అంశాలపై చర్చించారు. పోలీసుశాఖ పరంగా తీసుకుంటున్న చర్యల్ని డీజీపీ మహేందర్రెడ్డి హోంమంత్రికి వివరించారు. సమావేశంలో హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేశ్ భగవత్ పాల్గొన్నారు. -
దాతృత్వ, సౌభ్రాతృత్వాలకు ప్రతీక రంజాన్
విజయవాడ : రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వానికి, సర్వమత సౌభ్రాతృత్వానికి ఈ రంజాన్ పండుగ ప్రతీక అని ఆయన అభివర్ణించారు. ‘సర్వ మానవాళి శ్రేయోదాయకంగా ఉండాలన్న గొప్ప సందేశం రంజాన్ ఒక పర్వదినాన ముస్లిం సోదరుల ప్రార్థనలలో మనకు ద్యోతకమవుతుంది. సాటివారికి సాయపడాలనే స్ఫూర్తిని ప్రవక్త మహమ్మద్ ఆదేశానుసారం కొనసాగించడం రంజాన్ పండుగలో ఒక విశిష్టమైన ఆనవాయితీగా వస్తోంది’-అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి వారి అభివృద్ధికి రూ.710 కోట్లు బడ్జెట్ను కేటాయించామని గుర్తుచేశారు. మైనారిటీల సంక్షేమానికి అన్నివిధాలుగా కృషి చేస్తున్నామని పేర్కొంటూ, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇప్పుడు అమలుచేస్తున్నన్ని కార్యక్రమాలు, పధకాలు గతంలో ఎన్నడూ, ఎవరూ చేయలేదని అన్నారు. హజ్ హౌస్ల నిర్మాణం, ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు, దుల్హాన్ పథకం, రంజాన్ తోఫా వంటి అంశాలు మైనారిటీల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచాయని చెప్పారు. దుల్హాన్ పథకం కింద పేద ముస్లిం యువతి వివాహానికి రూ.50 వేలు అందిస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. రాష్ట్రంలో మసీదుల మరమ్మతులకు రూ.5 కోట్లు నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మసీదుల మరమ్మతులకు రూ.10 వేలు, మండల కేంద్రాల్లో రూ.15 వేలు, మున్సిపాలిటీల్లో ఉన్న మసీదులకు రూ.20 వేలు చొప్పున మరమ్మతుల నిమిత్తం మంజూరు చేశామని వివరించారు. మసీదులలో పనిచేసే ఇమామ్లకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి ముస్లిం సోదరుడి ఇంటా రంజాన్ పండుగ ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మొత్తం 11 లక్షల ముస్లీం కుటుంబాలకు రంజాన్ చంద్రన్న తోఫా పంపిణీ చేశామని తెలిపారు. -
ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
హైదరాబాద్ : ముస్లిం సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు శుభాకాంక్షలు చెప్పారు. రంజాన్ పర్వదినం మాత్రమే కాదని, ప్రపంచ మానవాళికి అదొక స్ఫూర్తి అని అన్నారు. సర్వ మానవాళి సుఖంగా ఉండాలన్న ఆర్తి ముస్లిం సోదరుల ప్రార్థనలలో కనిపిస్తుందని తెలిపారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని పేర్కొన్నారు. ప్రజలు భగవంతుని కృప వల్ల సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.