ramanaidu studio
-
బుల్లితెరపై డబుల్ డోస్..ఎన్టీఆర్‌తో పాటు రానా
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి మరోసారి మరోసారి బుల్లితెర మీద హోస్ట్‌గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ‘నెం 1 యారి’ అనే టాక్ షోకు రెండు సీజన్లకు గానూ.. రానా హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పడు మూడో సీజన్‌తో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రామా నాయుడు స్టూడియోలో దీనికి సంబంధించిన టీజర్ షూట్‌ను కూడా చిత్రీకరించినట్లు సమాచారం. అయితే 2020 మార్చిలోనే సీజన్-3 ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఆ తర్వాత రానా వివాహం, విరాట పర్వం షూటింగ్ ఉండటంతో మరికొంత కాలం ఈ షోను వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈ మధ్యే టీజర్‌ను చిత్రీకరించడంతో అతి త్వరలోనే నెం 1 యారి మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. గత రెండు సీజన్లు రేటింగ్ పరంగా దూసుకుపోవడంలో రానా సక్సెస్ అయ్యారు. తన హోస్టింగ్‌తో హుషారెత్తించారు. త్వరలోనే బుల్లితెరపై నెం 1 యారి సీజన్-3 ప్రారంభం కానుండగా, ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మీలో ఎవరు కోటీశ్వరుడు షో కూడా ప్రసారం కానుంది. ఈ రెండు షోలు జెమిని ఛానల్లోనే టెలికాస్ట్ కానున్నాయి. ఇది ఫ్యాన్స్‌కు పండుగ లాంటిదే. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు బుల్లితెరపై సందడి చేయనుండటంతో ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా డబల్ కానుంది. చదవండి : (త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్లు!) (ఆస్కార్ బరిలో సూర్య సినిమా.. భారత్ నుంచి ఆ ఒక్కటే) -
టాలీవుడ్లో ఐటీ దాడుల కలకలం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ధియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు, కెఎల్ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టాలీవుడ్ నిర్మాతలు కంగారుపడుతున్నారు. కాగా, గత నెలలో ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్, సునీల్ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్‌ను కూడా ఈ సంస్థ నిర్మించింది. -
సినీ స్టూడియోలో డ్రగ్స్ కలకలం
బంజారాహిల్స్(హైదరాబాద్): ఆన్లైన్ పార్శిళ్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ఇటీవల పలువురు సినీ ప్రముఖులను విచారించిన నేపథ్యంలో వెల్లడైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆబ్కారీ శాఖ అధికారులు ఆన్లైన్ పార్శిళ్లపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోకు ఓ ఆన్లైన్ పార్శిల్ వచ్చినట్లు పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు మూడు గంటల పాటు స్టూడియోలో సోదాలు నిర్వహించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కనకదుర్గ ఆధ్వర్యంలో పది మంది అధికారులు ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను గుర్తించి తనిఖీలు నిర్వహించారు. విదేశాల నుంచి ఈ పార్శిల్ వచ్చినట్లు తమకు సమాచారం అందడంతో నిశితంగా పరిశీలించినట్లు కనకదుర్గ వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో ఆబ్కారి శాఖ మత్తుమందులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో కొందరు విదేశాల నుంచి నేరుగా ఆన్లైన్ నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు తేలడంతో అప్రమత్తమైన తాము ఈ తనిఖీలకు వచ్చినట్లు తెలిపారు. కాగా, తమకు విదేశాల నుంచి పార్శిల్ వచ్చిన మాట వాస్తవమేనని సినీ నిర్మాత దగ్గుబాట సురేష్‌బాబు తెలిపారు. తన కుమారుడు రానా వెన్ను నొప్పి నివారణ కోసం విదేశాల నుంచి ఓ పరికరాన్ని కొనుగోలు చేశామని దాని పార్శిల్ రామానాయుడు స్టూడియోకు వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఎక్సైజ్ సీఐ కనకదుర్గ పార్శిల్‌ను తనిఖీ చేసేందుకు స్టూడియోకు వచ్చారని తెలిపారు. ఇంకోవైపు రామానాయుడు స్టూడియోకు ఆన్లైన్ పార్శిల్లో డ్రగ్స్ వచ్చినట్లు పుకార్లు రావడంతో కలకలం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో మీడియా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
లైఫ్‌లో ఏం కావాలంటే...
విశాఖ : ‘‘ప్రతి మనిషికీ కొన్ని ఇష్టాలుంటాయి.. మరికొన్ని అయిష్టాలూంటాయి. వాటిన్నంటినీ పాజిటివ్‌గా తీసుకొని, నిత్యం ఉత్సాహం.. ఉత్తేజం.. ఉన్నతంగా జీవించాలనేది నా ఆశయం. అలా అని మితిమీరిన ఆశావాహ వైఖరిని కాను. చిన్నప్పటి నుంచి సామాజిక దృక్పథం అలవరుచుకున్నాను. పుట్టింది.. పెరిగింది.. హైదరాబాదే. విశాఖపట్నమంటే నా మనస్సుకు నచ్చిన నగరం. షూటింగ్‌కు వచ్చినప్పడల్లా తనవి తీరా నగరమంతా కలయ తిరగకుండా తిరిగి వెళ్లను....’’అంటున్నారు.. వర్దమాన సినీ నటి శ్వేత వర్మ. ఇటీవల ‘లైలా..ఓలైలా’ చిత్రీకరణ పూర్తి చేసుకొని అనంతరం రామానాయుడు స్టూడియోలో ‘సాక్షి’తో ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే.. కష్టే ఫలి...అనేది నా సూత్రం ఏ పనిలోనైనా కష్టపడితేనే దాని చివరి ఫలితం అమృతం. అందుకు నటనలో నేను చాలా కష్టపడి పనిచేయగలననే పేరు సినీ పరిశ్రమలో స్వల్ప వ్యవధిలోనే సంపాదించా!. నాన్నగారు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో డీన్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తిచేశా. అమ్మ ప్రోత్సాహంతోనే నటనా జీవితంలో అడుగు పెట్టా. షార్ట్ ఫిల్మ్‌తో అడుగులు... తొలుత షార్ట్‌ఫిల్మ్‌లో నటించాను. అనంతరం మనం, లక్ష్మీరా మా ఇంటికి, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్‌సింగ్, వర్షం, హోలీ వంటి చిత్రాల్లో అవకాశాలు రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాను. మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. విజయాలు పరంపర మన సొంతం కావాలంటే నిత్యం సాధన చేయాలనేది నా సిద్ధాంతం. అందులో భాగంగానే నిత్యం నటనలో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి సాధన చేస్తుంటాను. ఖాళీ సమయంలో జిమ్‌కు వెళ్లడం..కూచిపూడి, భరత నాట్యం సాధన చేస్తూ ఉంటాను. వైజాగ్ చుట్టొచ్చాను... పూర్తిస్థాయిలో లైలా..ఓ లైలా చిత్రంలో నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్రం మూడువంతులు విశాఖలోనే చిత్రీకరించడం వల్ల విశాఖ పరిసర ప్రాంతాలన్నీ తనివితీరా చూసే అవకాశం కలిగింది. ఇక్కడ వాతావరణం, ప్రజలు, సుందర దృశ్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.