జిల్లా స్థాయి రామాయణ పరీక్షకు సన్నాహాలు
అమలాపురం టౌన్ :
ఇంటింటా రామాయణం ఉండాలని అమలాపురం గోశాల ఇప్పటికే ప్రత్యేకించి మహిళలకు, డివిజన్ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు రమణీయ కావ్యం– రస రమ్య రామాయణం పేరుతో వాల్మీకి రామాయణంపై పరీక్షలు నిర్వహించింది. ఈసారి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులై ఆపై విద్యార్థులు ఐదు వేల మందితో జిల్లా స్థాయిలో రామాయణంపై పరీక్ష నిర్వహించేందుకు గోశాల సన్నహాలు చేస్తోంది. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు, టీఎల్పీ పబ్లిషర్స్ జిల్లా ప్రతినిధి చెరుకూరి రాంబాబు, పరమేశ్వర సేవా సమితి సభ్యులు సీతానగరంలో చిట్టి బాబాజీ సంస్థానం వ్యవస్థాపకుడు జగ్గుబాబు, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాíస్త్రి కుమారుడు వర్ధమాన సినీ సంగీత దర్శకుడు యోగీశ్వరవర్మతో గురువారం సమావేశమై ఈ చర్చించారు. రామాయణంలోని పాత్రలపై పరీక్ష నిర్వహిస్తున్నట్లు పోతురాజు రామకృష్ణారావు తెలిపారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వెయ్యి మంది విద్యార్థులకు ఒక రోజు పాజిటివ్ థింకింగ్పై శిక్షణ తరగతి నిర్వహిస్తామన్నారు. తనతో పాటు తన తండ్రి సీతారామశాస్త్రి కూడా జిల్లా స్థాయి రామాయణ పరీక్షకు హాజరవుతామని సంగీత దర్శకుడు యోగీశ్వరశర్మ అన్నారు. ఈ పరీక్ష కోసం సూచనలు, సలహాలు అందించేందుకు 9248135777, 9248135999 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని గోశాల ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.