Ramineni Foundation
-
ఉపాధ్యాయులకు సత్కారం
-
'రామినేని' సేవలు సమాజానికి మేలు
రామినేని అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, విశాఖపట్నం: డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యూఎస్ఎ) చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆ సంస్థ సేవలను ఇతరులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. రామినేని ఫౌండేషన్ 16వ వార్షికోత్సవ పురస్కారాల ప్రదాన కార్యక్రమం విశాఖలో సోమవారం రాత్రి నిర్వహించారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు విశిష్ట పురస్కారం, సినీనటుడు డాక్టర్ కైకాల సత్యనారాయణ, నవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, డెరైక్టర్ డాక్టర్ సి.మృణాళినిలకు విశేష పురస్కారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో మంచిపనికి గుర్తింపు ఉండాలని, అలాంటి మంచి పనులు చేసే వారిని ప్రోత్సహిస్తే మరింత మంది ముందుకొస్తారని చెప్పారు. విశిష్ట పురస్కార గ్రహీత చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణ చేసిన వారు సంతోషాన్ని, తృప్తిని పొందుతారన్నారు. పొగడ్తలు ప్రమాదకరమైన మత్తు పదార్థం లాంటివని అభివ ర్ణించారు. విశేష పురస్కార గ్రహీత కై కాల సత్యనారాయణ మాట్లాడుతూ రామినేని పురస్కారం తనకు మిక్కిలి సంతోషాన్నిస్తోందని చెప్పారు. అవార్డు గ్రహీతలు మృణాళిని, అంపశయ్య నవీన్‌లు తమను పురస్కారాలకు ఎంపిక చేసిన రామినేని ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ కె.హరిబాబు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం, కొండవీటి జ్యోతిర్మయి, బీవీ పట్టాభిరాం తదితరులు పాల్గొన్నారు. -
రామినేని ఫౌండేషన్ అవార్డు గ్రహీతలు
విశాఖపట్నం: డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఇచ్చే అవార్డు గ్రహీతల పేర్లను ఏపీ ఉన్నత విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో వెల్లండించారు. ఈ నెల 12న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేయనున్నారు. డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు(ప్రముఖ ప్రవచనకర్త), డాక్టర్ కైకాల సత్యనారాయణ(సినీనటుడు), డాక్టర్ అంపశయ్య నవీన్(నవలా రచయిత), డాక్టర్ సి.మృణాళిని( ప్రొఫెసర్ అండ్ డెరైక్టర్ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ)లు ఈ అవార్డులను అందుకోనున్నారు. -
గ్రామాలను దత్తత తీసుకోవాలి
డాక్టర్ రామినేని ఫౌండేషన్‌ను కోరిన ఎంపీ కేశినేని సాక్షి,విజయవాడ : సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే డాక్టర్ రామినేని ఫౌండేషన్ వంటి సంస్థలు గ్రామాలను దత్తత తీసుకుని, వాటిని అభివృద్ధి చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కోరారు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ 15వ పురస్కారోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ పాఠశాలలు, విద్యార్థులకు రామినేని ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తోందని, గ్రామాలను కూడా అభివృద్ధి చేయాని కోరారు. కృష్ణాజిల్లా వారు తెలివైన వారంటూ మాజీ ఎమ్మెల్యే వయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలకు కేశినేని స్పందిస్తూ ఇక్కడి యువతులను పెళ్లి చేసుకుని రాయలసీమ ప్రజలు కూడా తెలివి నేర్చుకుని రాజ్యాలు ఏలుతున్నారంటూ చతురోక్తి విసిరారు. ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ సంప్రదాయాలు దెబ్బతినకుండా చూడాలని డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి కృషి చేశారని, అందుకే ఆయన కుమారులకు ధర్మప్రచారక్ , సత్యవాది, హరిశ్చంద్రుడు వంటి పేర్లు పెట్టారని కొనియాడారు. తండ్రి ఆశయాలను ఆయన కుమారులు కొనసాగించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను సత్కరించడం ఫౌండేషన్ గొప్పదనమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సీసీఎన్‌బీ డెరైక్టర్ డాక్టర్ సిహెచ్.మోహనరావుకు విశిష్ట పురస్కరం కింద లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రం, శాలువాలతో సత్కరించారు. సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నంనాయుడు, సినీనటుడు రాళ్లపల్లికి విశేష పురస్కారాల కింద నగదు, ప్రశంసాపత్రం అందజేసి సత్కరించారు. అనంతరం డాక్టర్ పొత్తూరి మాట్లాడుతూ ఉన్నతమైన ఆశయాలతో ఈ ఫౌండేషన్ ఏర్పడిందన్నారు. అయ్యన్న చౌదరి తన కుమారులకు పెట్టిన పేర్లే ఆయనకు మన సంస్కృతిపై ఉన్న ప్రేమను తెలుపుతోందన్నారు. గుంటూరు జెడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ఫౌండేషన్ సేవలను వివరించారు. ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్, మేయర్ కోనేరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణానంద స్వామీజీ రూపొందించిన భగవద్గీత యూఎస్‌బీని ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ప్రారంభంలో మాధవపెద్ది మూర్తి బృందం సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించింది.