-
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్‌ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు ముస్లింలకు ఇఫ్తార్ విందు
-
శుభాల సరోవరం
పరమ పవిత్రమైన రంజాన్ మాసం వచ్చేసింది. ముస్లింల ఐదు విధులు– విశ్వాసం, నమాజ్, జకాత్, రోజా, హజ్‌లలో రోజాను రంజాన్ మాసంలో త్రికరణ శుద్ధితో ఆచరిస్తారు. ఉపవాసాన్ని అరబీ భాషలో ‘సౌమ్’ అని, వ్యవహారిక ఉర్దూ భాషలో ‘రోజా’ అనీ పిలుస్తారు. ఇస్లామియా క్యాలెండర్లో 9వ నెల అయిన రంజాన్lమాసంలో ఈ ఆరాధన వ్రతాన్ని పాటిస్తారు. ఇస్లాంలో ‘రోజా’ అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించకుండా సేవించకుండా మనోవాంఛలకు దూరంగా ఉండడం. ఉపవాసాల గురించి దివ్యఖురాన్లో ఆదేశాలు ఇలా తెలపబడ్డాయి. ‘ముస్లిం సోదరులారా! ఉపవాసాలు మీకు విధిగా నిర్ణయించబడ్డాయి. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం కలుగుతుంది’. దివ్యఖురాన్లో... ఉపవాస ప్రాముఖ్యత ఉపవాసం ఇతర ఆరాధనల కంటే భిన్నమైంది. నమాజ్‌లో మనిషి కూర్చొనడం... నిల్చొనడం... రుకులు.. సజ్దాలు చేయడం లాంటివి చేస్తాడు. దీనిని ప్రతి వ్యక్తి చూడగలడు. ‘జకాత్’ (దానం)lవిషయం కనీసం దానిని తీసుకునే వ్యక్తికైనా తెలిసిపోతుంది. ‘హజ్’ విధిని లక్షల మంది ఎదుట నిర్వహిస్తాడు. కాని ఉపవాసమనేది దేవుడికి, దాసుడికి మధ్యనే ఉంటుంది. మూడోవ్యక్తికి తెలియదు. ‘ఉపవాసం కేవలం నా కోసం మాత్రమే పాటించబడుతుంది. నేను దానికి పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాన’ని దేవుడు అంటాడు. ఉపవాసం కవచం వంటిది. ఎవరైతే ఉపవాసం పాటిస్తున్నారో, వారు అశ్లీలానికి, అలజడికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా వారితో దుర్భాషలకు గాని తగాదాలకు గాని దిగితే నేను ఉపవాసం పాటిస్తున్నానని చెప్పాలి. ఫలమాసం రంజాన్ మాసంలో సత్కార్యాల పుణ్యం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. ఒక విధిని నెరవేరిస్తే 70 విధులు నిర్వర్తించిన దానికి సమానంగా పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా రంజాన్ మాసంలో శుభాలను పొందే మహాభాగ్యాన్ని అల్లాహ్ కలగజేశాడు. ఈ రంజాన్ చూశాం... మరో రంజాన్ చూస్తామో లేదో తెలియదు... ఇలాంటి అవకాశం మళ్లీ లభిస్తుందా...? లేదా.. తెలియదు. కనుక ఈ మాసంలో మనం చేతులు చాచి శుభాలను నింపుకోవాలి. జీవితంలో సంస్కరణలు ఎక్కడ అవసరమో గ్రహించి అక్కడ సంస్కరించుకోవాలి. దైవం మనందరికి రంజాన్lశుభాలను సమృద్ధిగా పొందేlభాగ్యాన్ని ప్రసాదించాలి. – మహమ్మద్ మంజూర్ మినహాయింపులు... మనిషి కష్టసుఖాలను బాగా ఎరిగిన దైవం ఉపవాసాన్ని విధిగా నిర్ణయించినప్పటికీSకొందరికి కొన్ని మినహాయిƇపులు ఇచ్చాడు. పిల్లలకు, బాటసారులకు, రోగులకు, వృద్ధులకు, మతి స్థిమితం లేనివారికి, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు మినహాయింపు ఉంది. అలాంటి వారి ఉపవాసం వ్యర్థం! ⇔ ఒకపక్క ఉపవాసం పాటిస్తూ మరోపక్క అబద్ధం చెబుతూ మోసాలు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఉపవాసాన్ని దేవుడు ఆమోదించడు. ⇔ ఉపవాసకుడు చాడీలు చెప్పకూడదు. ఎవరి మీదనైనా చాడీలు చెప్పినప్పుడు వారికి ఆ ఉపవాస ఫలితం దక్కదు. పరమార్థమిదే.... ⇔ దైవభీతి, నైతికత, మానవత్వ విలువలున్న ఉత్తమ సమాజ నిర్మాణమే ఉపవాస లక్ష్యం. ఇంతటి ప్రాధాన్యమున్న రోజా లక్ష్యాలు, ఉద్దేశాలను గురించి దివ్యఖురాన్ ముస్లింలను ఉద్దేశించి పలు బోధనలు చేస్తుంది. ⇔ దేశ రక్షణకు పోరాడే సైనికులకు శిక్షణ ఎంత అవసరమో ప్రపంచంలో మంచిని పెంపొందించేందుకు పాటుపడే వారికి కూడా శిక్షణ అంతే అవసరం. అలాంటి తర్ఫీదు నెల రోజుల పాటు రోజాల రూపంలో ఉంటుంది. దానికి కొనసాగింపుగా ఐదు పూటలా నమాజు, దానధర్మాలు, ఖురాన్ పారాయణం వంటి దైనందిన కార్యక్రమాలు ఆ స్ఫూర్తిని ఏడాది వరకు కొనసాగిస్తాయి. ⇔ తనను ఎవరూ చూడకపోయినా దైవం చూస్తున్నాడని విశ్వసిస్తూ ఆకలిదప్పులు దహిస్తున్నా గుక్కెడు నీళ్లయినా నోట్లో పోసుకోడు ఉపవాసి. ఈ విధంగా నాయకుడు, పర్యవేక్షకుడు ఉన్నా లేకపోయినా, తనకు తానుగా కట్టుబడి పనిని నిబద్ధతతో చేసే లక్షణం అలవడుతుంది. బాధ్యత, జవాబుదారీతనంతో తన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకుంటాడు. పరుల సొమ్ముకు ఆశపడడు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
ఆసియాలోనే అతిపెద్ద సూపర్ స్టార్ గా రజనీ..ఆ విషయంలో అందరికంటే టాప్..
కౌంటింగ్ ప్రక్రియకుపరిశీలకుల నియామకం
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు
16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
అసలు విషయం చెప్పేసిన రష్మిక..గాల్లో తేలుతున్న రౌడీ బాయ్స్..
విద్యుదీకరణ త్వరగా పూర్తి చేయండి
వన్యప్రాణులపై తూటా..!
బెస్ట్ వేల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో ఏయూకు స్థానం
మరో ముగ్గురు అటవీఅధికారులపై వేటు
కేజీహెచ్‌కు కారు వితరణ
తప్పక చదవండి
- ఎలాన్ మస్క్‌కు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్.. ఇండియాకు రావాలంటూ ట్వీట్
- India vs China: టగ్ ఆఫ్ వార్‌లో భారత బలగాల గెలుపు
- నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు
- రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
- స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
Advertisement