నేడు రాంగ్ వే షుటింగ్ ప్రారంభం
ఆదిలాబాద్ రిమ్స్ : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను దష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘రాంగ్‌వే’ టైటిల్‌తో షార్ట్ ఫిల్మ్ రూపొందించనున్నట్లు ఆల్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయిం సర్కార్ తెలిపారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రింట్మీడియా ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలో గురువారం షుటింగ్ ప్రారంభిస్తామని, చుట్టు పక్కల ప్రాంతాల్లో మూడు రోజుల పాటు షుటింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలోని నూతన నటీనటులతో ఈ ఫిల్మ్‌లో అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జీ9 ఫిల్మ్స్ ఆదిలాబాద్ ప్రొడక్షన్ 30 నిమిషాల నిడివిగల ఫిల్మ్ తీసుకున్నామన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మతి చెందిన చిన్నారి రమ్య లాంటి కుటుంబానికి జరిగిన ఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందులో ఉంటాయన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన సుధీర్‌కుమార్ హీరోగా నటిస్తున్నారని, మిగతా ఆర్టిస్ట్‌లంతా జిల్లాకు చెందిన వారే ఉంటారని తెలిపారు. ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాంబాబు ఈ ఫిల్మ్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ రాంబాబు, అసోసియేషన్ నాయకులు లక్ష్మణ్, రెహమాన్, మనోజ్ పాల్గొన్నారు.