ranganath goud
-
నాలుగేళ్ల పోరాటానికి తొలి విజయం
నాలుగేళ్ల పాటు కొనసాగించిన పోరాటానికి తొలి విజయం లభించింది. అన్యాయం జరిగిందని ఆక్రోశించిన రజియా సుల్తానాకు అధికారులు అండగా నిలబడ్డారు. ప్రేమ పేరుతో ఖాకీ ముసుగులో మోసానికి పాల్పడ్డ ఎస్ఐ రంగనాథ్‌గౌడ్‌పై వేటు వేశారు. గుంటూరు రేంజి ఐజీ పి.వి.సునీల్‌కుమార్ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం జిల్లా పోలీస్ వర్గాల్లో సంచలనమైంది. అదేస్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. పొన్నూరుకు చెందిన రజియా సుల్తానాకు ఇంటర్ చదివే రోజుల్లో (2009, జూలైలో) అప్పటి ఎస్ఐ రంగనాథ్‌గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత తనను రంగనాథ్ ప్రేమపేరుతో మోసం చేశాడని అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ కేసు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో జిల్లా పోలీస్ అధికారులు రంగనాథ్‌గౌడ్‌ను సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. కొన్నాళ్ల తరువాత అరెస్టయిన రంగనాథ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేశాక నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యాడు. అప్పటి నుంచి రజియా సుల్తానా న్యాయపోరాటం సాగిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఒక సందర్భంలో ఆమె సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకుంది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకుంది. దీనికితోడు గుంటూరు రేంజి ఐజీ సునీల్‌కుమార్ కూడా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకటికి రెండుసార్లు రజియాసుల్తానా ఆవేదనను విన్నారు. ఒంగోలు డీఎస్పీ జాషువాను న్యాయవిచారణ జరపాలని ఏడాది కిందట ఆదేశాలు జారీ చేశారు. గత డిసెంబరులో గుంటూరు వచ్చిన డీఎస్పీ జాషువా రంగనాథ్, రజియా సుల్తానాలతో విడివిడిగా మాట్లాడి వారి వాదనలను విన్నారు. ఆయన నుంచి నివేదిక అందుకున్న ఐజీ సునీల్‌కుమార్ కేసులోని వాస్తవాలను గుర్తించారు. విచారణలో వాస్తవాలు వెలుగు చూసిన క్రమంలో ఎస్ఐ రంనాథ్‌గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఐజీ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొంది. రజియా సుల్తానా కేసుతో పాటు మరో నాలుగు కేసుల్లోనూ రంగనాథ్గౌడ్ పాత్ర ఉన్నట్లు విచారణలో రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐజీ పేర్కొన్నారు. జిల్లా అంతటా చర్చే... కాగా రంగనాథ్‌గౌడ్‌పై పోలీస్ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరిగింది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌వర్గాలు, మహిళా సంఘాలు, కళాశాల విద్యార్థినులు ఇదే విషయంపై చర్చించుకోవడం కేసు ప్రాధాన్యతను తేటతెల్లం చేసింది. రంగనాథ్‌గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన విషయంపై బాధితురాలు రజియా సుల్తానా స్పందిస్తూ పోలీసులు పరంగా తనకు న్యాయం జరిగినట్లే, కోర్టు పరంగానూ న్యాయం జరగాలని, రంగనాథ్‌పై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరింది. కష్టకాలంలో తనకు వె న్నంటే ఉండి ధైర్యాన్నిచ్చిన కుటుంబ పెద్దలు, స్నేహితులకు రజియా కృతజ్ఞతలు తెలిపింది. -
'ఆడపిల్లతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే పోరాడా'
నూజివీడు:నెల్లూరు ట్రాఫిక్ ఎస్సై రంగనాథ్ గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల తనకు సగం న్యాయం మాత్రమే జరిగిందని అతని వల్ల మోసపోయిన యువతి రజియా సుల్తానా వెల్లడించింది. రంగనాథ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఐజీ పి.సునీల్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రజియా నూజివీడులో స్పందించింది. అతడికి కోర్టులో శిక్ష పడినప్పడే తనకు పూర్తి న్యాయం జరిగినట్లు భావిస్తానని స్పష్టం చేసింది. తాను న్యాయం కోసం ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం చేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో రంగనాథ్ నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. కేసును వదిలి రాజీకి రావాలని లేకుంటే చంపేస్తానని బెదిరించాడని అయిన తాను బెదరలేదన్నారు. రూ. 10 లక్షల నగదుతోపాటు ఉద్యోగం కూడా ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చాడని అయిన అందుకు లొంగలేదని చెప్పింది. ఆడపిల్లను మోసం చేస్తే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియాలనే తాను రంగనాథ్ విషయంలో పోరాటం చేసినట్లు వివరించింది. పోలీసు డిపార్ట్మెంట్ పరంగా తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నట్లు రజియా పేర్కొన్నారు. గతంలో గుంటూరు జిల్లా పొన్నూరులో రంగనాథ్ గౌడ్ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రజియా సుల్తానా అనే యువతి అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పోలీసు నుంచి సరైన స్పందన లేకపోవడంతో గుంటూరులో మహిళ సంఘాలనేతలతో కలసి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసు ఉన్నతాధికారులు రంగనాథ్ గౌడ్‌పై విచారణకు ఆదేశించారు. రంగనాథ్ గౌడ్ పోలీసు బాధ్యతలకు విరుద్ధంగా పని చేశారని ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. దాంతో విధుల నుంచి తొలగించాలని ఐజీ పి.సునీల్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు రంగనాథ్ గౌడ్‌ను విధుల నుంచి తొలగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రంగనాథ్ గౌడ్ నెల్లూరులో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం విదితమే. -
ఎస్సై రంగనాథ్ గౌడ్ ఉద్యోగం ఔట్
గుంటూరు రేంజ్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రంగనాథ్ గౌడ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఐజీ పి.సునీల్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గుంటూరు జిల్లా పొన్నూరులో రంగనాథ్ గౌడ్ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రజియా సుల్తానా అనే యువతి అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పోలీసు నుంచి సరైన స్పందన లేకపోవడంతో గుంటూరులో మహిళ సంఘాలనేతలతో కలసి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసు ఉన్నతాధికారులు రంగనాథ్ గౌడ్‌పై విచారణకు ఆదేశించారు. రంగనాథ్ గౌడ్ పోలీసు బాధ్యతలకు విరుద్ధంగా పని చేశారని ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. దాంతో విధుల నుంచి తొలగించాలని ఐజీ పి.సునీల్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు రంగనాథ్ గౌడ్‌ను విధుల నుంచి తొలగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రంగనాథ్ గౌడ్ నెల్లూరులో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం విదితమే.