ఎస్సై రంగనాథ్ గౌడ్ ఉద్యోగం ఔట్ | Ranganath Goud removed from police job In Razia Sultana Case | Sakshi
Sakshi News home page

ఎస్సై రంగనాథ్ గౌడ్ ఉద్యోగం ఔట్

Published Fri, Feb 14 2014 3:36 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

ఎస్పై రంగనాథ్ గౌడ్, బాధితురాలు రజియా సుల్తానా

ఎస్పై రంగనాథ్ గౌడ్, బాధితురాలు రజియా సుల్తానా

గుంటూరు రేంజ్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రంగనాథ్ గౌడ్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఐజీ పి.సునీల్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గుంటూరు జిల్లా పొన్నూరులో రంగనాథ్ గౌడ్ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రజియా సుల్తానా అనే యువతి అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పోలీసు నుంచి సరైన స్పందన లేకపోవడంతో గుంటూరులో మహిళ సంఘాలనేతలతో కలసి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

 

దాంతో పోలీసు ఉన్నతాధికారులు రంగనాథ్ గౌడ్పై విచారణకు ఆదేశించారు. రంగనాథ్ గౌడ్ పోలీసు బాధ్యతలకు విరుద్ధంగా పని చేశారని ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. దాంతో  విధుల నుంచి తొలగించాలని ఐజీ పి.సునీల్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు రంగనాథ్ గౌడ్ను విధుల నుంచి తొలగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రస్తుతం రంగనాథ్ గౌడ్ నెల్లూరులో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం విదితమే.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement