బోల్తా పడ్డ బస్సు : నలుగురు మృతి
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ జల్పాయిగురి జిల్లాలోని రాణిరత్ సమీపంలో రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జల్పాయిగురి సర్ధార్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగంతో వెళ్తున్న బస్సు రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. అనంతరం బోల్తా పడిందని చెప్పారు. దూప్గురి నుంచి జమర్ధహ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.