Ranji Trophy quarter-final
-
రంజీలో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. సెమీఫైనల్‌కు బెంగాల్
రంజీట్రోపీ 2022లో భాగంగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. జూన్ 14-18 మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్లో బెంగాల్, మధ్యప్రదేశ్‌లు అమితుమీ తేల్చుకోనున్నాయి. మరో సెమీఫైనల్లో ముంబై, ఉత్తర్ ప్రదేశ్ తలపడనున్నాయి. కాగా ఆటకు శుక్రవారం ఆఖరి రోజు కాగా.. ఫలితం వచ్చేలా కనబడకపోవడంతో గంట ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. టీమిండియా క్రికెటర్.. బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి సూపర్ సెంచరీతో మెరిశాడు.129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను మనోజ్ తివారి తన ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. 152 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అభిషేక్ పోరెల్(34) పరుగులతో కలిసి ఐదో వికెట్‌కు అమూల్యమైన 92 పరుగులు జోడించాడు. ఆ తర్వాత షాబాజ్ అహ్మద్(46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. ఓవరాల్‌గా మనోజ్ తివారి 185 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగులు చేశాడు. అంతకముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌ను 773 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్‌కు 475 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. చదవండి: రంజీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు -
బౌలర్లు చెలరేగితే అట్లనే ఉంటది.. ఒకే రోజు 21 వికెట్లు!
బెంగళూరు: కర్ణాటక, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగారు. ఫలితంగా మ్యాచ్ రెండో రోజు మంగళవారం మొత్తం 21 వికెట్లు కుప్పకూలాయి. ఓవర్‌నైట్ స్కోరు 213/7తో ఆట కొనసాగించిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ గోపాల్ (56 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకోగా... లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కూడా కర్ణాటక తడబడింది. ఆట ముగిసేసరికి ఆ జట్టు 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. సౌరభ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 647 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 577 పరుగులు సాధించింది. చదవండి: Sunil Gavaskar 174-ball 36 Runs: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్ బాక్స్ విసిరేసిన క్రికెట్ అభిమాని -
సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
♦ జోగియాని, జాక్సన్ సెంచరీలు ♦ విదర్భతో ‘రంజీ’ క్వార్టర్ ఫైనల్ సాక్షి, విజయనగరం: సాగర్ జోగియాని (130; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), షెల్డన్ జాక్సన్ (122; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో... విదర్భతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 112.4 ఓవర్లలో 375 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రకు 224 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఉమేశ్ 5, ఆదిత్య 4 వికెట్లు తీశారు.తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ప్రస్తుతం విదర్భ 207 పరుగులు వెనుకబడి ఉంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అస్సాం తొలి ఇన్నింగ్స్: 323 ఆలౌట్ (సయ్యద్ మొహమ్మద్ 121, సిద్ధార్థ్ కౌల్ 4/99); పంజాబ్ తొలి ఇన్నింగ్స్: 137 ఆలౌట్ (మయాంక్ 80 నాటౌట్, కృష్ణ దాస్ 3/54, అరూప్ దాస్ 3/41); అస్సాం రెండో ఇన్నింగ్స్: 23/4. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 348 ఆలౌట్ (దేవేంద్ర బుండేలా 58, హర్‌ప్రీత్ 51, ప్రతాప్ సింగ్ 5/76); బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 121 ఆలౌట్ (ఈశ్వరన్ 48, ఈశ్వర్ పాండే 4/45, పునీత్ 3/30); మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: 14/0. ముంబై తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (అభిషేక్ నాయర్ 74, ఇక్బాల్ అబ్దుల్లా 33, సుఫియాన్ 23, నదీమ్ 5/140); జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్: 150/8 (ఆనంద్ 39, కౌశల్ సింగ్ 22 నాటౌట్, గౌతమ్ 18, హర్‌వాడేకర్ 3/26, ఇక్బాల్ అబ్దుల్లా 3/39).