Rarandoi Veduka Chuddam
-
ఏం జరిగిందో..ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తా
సాక్షి, హైదరాబాద్ : బుల్లితెర వ్యాఖ్యాత రవి బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా కార్యక్రమంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం రవి ఇవాళ ఉదయం కోర్టుకు వచ్చాడు. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది. కేసు విచారణఅనంతరం కోర్టు బయటకు వచ్చిన యాంకర్ రవిని... మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరంగా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేస్తా. మీడియాకు ఇంకా మసాలా ఇవ్వదలచుకోలేదు. కొన్ని పర్సనల్స్ ఉంటాయి. అన్ని బయటకు చెప్పలేం. నేను చాలా మారాను. దీనిపై నేను ఏమన్నా మాట్లాడితే...మళ్లీ అదో పెద్ద న్యూస్ చేస్తారు’ అంటూ రవి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కాగా నాగ చైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే చలపతిరావు చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ సూపర్ గా చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేసిన యాంకర్ రవిపై కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. -
సీతారామ కల్యాణ మొదలు
సిల్వర్ స్క్రీన్‌పై శివ, భ్రమరాంబల పెళ్లి వేడుకను ఈ ఏడాదిలో చూశాం. అదేనండీ.. శివ పాత్రలో నాగచైతన్య, భ్రమరాంబ పాత్రలో రకుల్ ప్రీత్‌సింగ్ నటించారు కదా! ఇప్పుడు మీకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా గుర్తొచ్చే ఉంటుంది. ప్రజెంట్ ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నారు. హర్ష డైరెక్షన్లో నిఖిల్ కుమార్ నటించనున్నారు. ‘సీతరామ కల్యాణ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బెంగళూరులో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నిఖిల్ తల్లిదండ్రులు అనితా కుమారస్వామి, హెచ్డి. కుమారస్వామి క్లాప్ ఇచ్చారు. నిఖిల్ కుమార్ ఎవరో తెలుసా? కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తనయుడు. ఇంకా స్ట్రాంగ్‌గా చెప్పాలంటే... భారత మాజీ ప్రధానమంత్రి హెచ్డీ. దేవగౌడ మనవడు. మహాదేవ్ డైరెక్షన్లో నిఖిల్ కుమార్ హీరోగా గత ఏడాది ‘జాగ్వార్’ సినిమా తెలుగు, కన్నడలో రిలీజ్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. -
అవన్నీ వందతులే: రకుల్ ప్రీత్
చెన్నై: అభిమానులకు నచ్చేది హీరోయిన్ల అందాలేనంటోంది నటి రకుల్‌ప్రీతిసింగ్. కెరీర్ ప్రారంభంలో అవకాశాలు దక్కక కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు మకాం పెట్టిన ఈ బ్యూటీకి తెలుగు చిత్రపరిశ్రమ కలిసి వచ్చింది. రకుల్ ప్రీతి నటించిన తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం కూడా విజయబాటలో పయనించడంతో ఆమె మంచి జోష్‌లో ఉంది. అయితే అదే జోష్‌ను కోలీవుడ్‌లో పొందాలని తహతహలాడుతున్న ప్రస్తుతం కార్తీతో ‘ధీరన్ అధికారం ఒండ్రు’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడిచ్చిన భేటీలో ఏమందో చూద్దాం.. ►సినిమా షూటింగ్ లొకేషన్స్ నాకు పాఠశాల లాంటిది. నిత్యం ఒక విద్యార్ధిలా వచ్చి నటించి వెళుతుంటాను. అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. జయాపజయాల గురించి ఆలోచించకుండా కఠినంగా శ్రమిస్తున్నాను. సినిమా నుంచి గ్లామర్‌ను వేరు చేయలేం. హీరోయిన్లు గ్లామరస్‌గా నటిస్తేనే అభిమానులు చూస్తారు. గ్లామర్ దుస్తుల్లోనూ హీరోయిన్లను దేవతలుగా చూడవచ్చు. ఇకపోతే ముద్దు సన్నివేశాలలో నటించడం తప్పు కాదు. ►కథకు అవసరం అయితే అలాంటి సన్నివేశాలలో నటిస్తాను. అయితే ఆ సన్నివేశాలు అశ్లీలంగా ఉండకూడదు. కొందరు ప్రచారాల కోసమే ముద్దు సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అలాంటి ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు నచ్చదు. సినిమా ఫీల్డ్ చాలా నచ్చింది. విరామం లేకుండా నటిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. కథలను నేనే ఎంపిక చేసుకుంటున్నాను. మంచి పాత్రలు అనిపిస్తేనే అంగీకరిస్తున్నాను. సినిమా నాకు చాలా ఇచ్చింది. ఇక్కడ నేనేమీ కోల్పోలేదు. ►కొన్ని చిత్రాలకు కాల్షీట్స్ ఇచ్చి అందులో నటించకుండా దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నాననే వదంతులు ప్రచారం చేస్తున్నారు. నిజానికి నేనెప్పుడూ అలా చేయను. అదే విధంగా చిత్ర జయాపజయాల గురించి బాధపడను. ఒక చిత్ర పరాజయానికి అందులో పని చేసిన వారందరూ బాధ్యత వహించాలి. ఈ సినిమా విజయం సాధిస్తుంది, ఈ చిత్రం అపజయం పాలవుతుందని ఎవరూ చెప్పలేరు. స్టార్ నటీనటులు నటించిన భారీ బడ్జెట్ చిత్రాలూ ప్లాప్ అవుతున్నాయి. చిన్న చిత్రాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి.. ’అంటూ ముగించింది. -
‘రారండోయ్.. వేడుక చూద్దాం’ పాటల వేడుక