ఏం జరిగిందో..ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేస్తా | Anchor Ravi appear in nampally court | Sakshi
Sakshi News home page

నాంపల్లి కోర్టుకు యాంకర్‌ రవి

Published Wed, Jan 10 2018 11:10 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

Anchor Ravi appear in nampally court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బుల్లితెర వ్యాఖ్యాత రవి బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’  సినిమా  కార్యక్రమంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం రవి ఇవాళ ఉదయం కోర్టుకు వచ్చాడు.  కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది. కేసు విచారణఅనంతరం కోర్టు బయటకు వచ్చిన యాంకర్‌ రవిని... మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరంగా ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేస్తా. మీడియాకు ఇంకా మసాలా ఇవ్వదలచుకోలేదు. కొన్ని పర్సనల్స్‌ ఉంటాయి. అన్ని బయటకు చెప్పలేం. నేను చాలా మారాను. దీనిపై నేను ఏమన్నా మాట్లాడితే...మళ్లీ అదో పెద్ద న్యూస్‌ చేస్తారు’ అంటూ రవి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

కాగా నాగ చైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే చలపతిరావు చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ సూపర్ గా చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేసిన యాంకర్ రవిపై కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement