rathnakar
-
టీడీపీ కోమటి జయరాం పై కడప రత్నాకర్ ఫైర్
-
మరో 30 ఏళ్ళు ఏపీకి సీఎంగా జగనే ఉంటారు
-
'ప్రజాసంకల్పయాత్ర'లో వైఎస్ఆర్ సీపీ అమెరికా కన్వీనర్
-
'ప్రజాసంకల్పయాత్ర'లో వైఎస్ఆర్ సీపీ అమెరికా కన్వీనర్
సాక్షి, నేలతిమ్మాయిపల్లి: 'ప్రజాసంకల్పయాత్ర'లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్ జగన్ అభిమానులు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనడానికి వస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ అమెరికా కన్వీనర్ రత్నాకర్ తన టీం సభ్యులతో కలిసి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. రత్నాకర్ తొలిరోజు వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ దగ్గర నివాళులు అర్పించి వైఎస్ జగన్‌తో కలిసి.. ఇడుపులపాయ- వేంపల్లి, వేంపల్లి-నేలితిమ్మాయిపల్లి వరకు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్నారు. గతంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ఏపీలో అన్ని కులాలు, మతాల వారి సమస్యలను తెలుసుకొని సీఎంకాగానే అందరికి న్యాయం చేశారని రత్నాకర్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ ఏపీ పరిస్థితి ఎటు పోతుందో, నిరుద్యోగ యువత పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మహానేత పరిపాలన మళ్లీ చూడాలనే వైఎస్ జగన్‌వెంట పాదయాత్రంలో పాల్గొంటున్నామన్నారు. గతంలో మహానేతకు పట్టం కట్టినట్టే ఇప్పుడు కూడా వైఎస్ జగన్‌కు తెలుగు ప్రజలు పట్టం కడతారన్నారు. వైఎస్ఆర్ కుటుంబం ఇచ్చిన మాట తప్పదు అనే గట్టి నమ్మకం అందరికి ఉందన్నారు. ప్రజాసంకల్పయాత్ర విజయవంతమై ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ సీఎం అయి ఏపీ, దేశ విదేశాల్లోని తెలుగువారికి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం వైఎస్సార్ జిల్లాలో ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన వైఎస్ జగన్ మొదటి రోజు 10 కిలోమీటర్లు, రెండో రోజు 12.8 కిలోమీటర్లు, మూడో రోజు 16.2 కిలోమీటర్లు నడిచారు. -
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌లు అప్రజాస్వామికం
న్యూయార్క్: సోషల్ మీడియాలో విమర్శించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటలం పట్ల చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం, వేధింపులకు పాల్పడటాన్ని వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ విభాగం తీవ్రంగా ఖండించింది. తప్పుడు ఆరోపణలతో సోషల్ మీడియా కార్యకర్తలు రవికిరణ్, రవీంద్రలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ కన్వీనర్ రత్నాకర్ అన్నారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. -
తనయుడితో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం
చందంపేట: భార్య, అత్త, మామ, స్నేహితుడి వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి కొడుకుతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన పానుగంటి చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని బండ్లగూడలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన లలితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. గత ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం మొదలయ్యింది. భార్య లలిత బల్మూరు పోలీస్‌స్టేషన్‌లో చంద్రశేఖర్‌పై ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ వారి మధ్య ఘర్షణలు ఆగలేదు. తన చావుకు భార్య, అత్త, మామలు, స్నేహితుడు నాగరాజులే కారణమని సూసైడ్ నోట్ రాసి, చందంపేట మండలం పోలేపల్లి శివారులోని చెరిపల్లి అంతయ్యబావి వద్ద తాను విషం తాగి కుమారుడు రత్నాకర్‌కు తాగించాడు. ఇద్దరూ స్పృహ కోల్పోతూ రోడ్డుపై కనిపించడంతో చందంపేట నుంచి దేవరకొండకు వస్తున్న మాతంగి కాశయ్య అనే ప్రయాణికుడు చూసి రత్నాకర్‌ను వివరాలు అడగ్గా.. తండ్రి స్పృహ కోల్పోయాడని.. పురుగుల మందు తాగామని చెప్పాడు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. -
కొత్త్త సంవత్సరం.. విషాద సంద్రం
మందమర్రి రూర ల్, న్యూస్‌లైన్: మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ రాష్ట్రీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక విద్యానగర్ చెంచు కాలనీకి చెందిన మేకల రత్నాకర్(23) దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. డిసెంబర్ 31 కావడంతో అందరూ కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతున్నారు. తన ఇంట్లో ఈ వేడుకలు జరపాలనుకున్నాడు రత్నాకర్. ఈ విషయాన్ని ఇంట్లో వారితో కూడా సాయంత్రం సమయంలో చర్చించాడు. అప్పటిదాకా ఇంట్లో వారితో ఆనందంగా గడిపాడు. రాత్రి 12 గంటల సమయంలో స్వీట్లు పంచిపెట్టి బంధువుల నోరు తీపి చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా స్వీట్లు కొనేందుకు తన మోటార్ సైకిల్‌పై ఇంటి నుంచి బయల్దేరాడు. మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నాడు. స్వీట్ షాపు అవతలి పక్కన ఉండడంతో రోడ్డు క్రాస్ చేసేందుకు ముందుకు కదిలాడు. ఓ క్షణంలోనే బెల్లంపల్లి నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. అంతేకాక వాహనం అతడి పైనుంచి వెళ్లడంతో శరీరం నడుము కింది భాగం అంతా కూడా నుజ్జునుజ్జయింది. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కట్టలు తెంచుకున్న బంధువుల కోపాగ్ని చిధ్రమైన రత్నాకర్ మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యుల కోపం కట్టలు తెంచుకుంది. ప్రమాదానికి కారణమైన లారీపై రాళ్లతో దాడికి దిగారు. అద్దాలు ధ్వసం చేశారు. అంతటితో ఆగకుండా లారీకి నిప్పంటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని అదుపు చేయడం పోలీసులతో కూడా కాలేదు. పట్టణ సీఐ రఘునందన్, ఎస్సై రాజేందర్, ఎంత నచ్చజెప్పినా మృతుడి కుటుంబ సభ్యులు వినలేదు. రెండు గంటల పాటు బస్టాండ్ ప్రాంతం రణరంగంగా మారింది. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చివరకు నష్ట పరిహారం ఇప్పిస్తామని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, రత్నాకర్‌కు ఏడాది క్రి తమే వివాహమైంది. ఈ ఘటనతో అతడి కుటుంబం కొత్త సంవత్సరం వేళ విషాద సంద్రంలో మునిగింది. -
వివాదాల నిలయంగా మారుతున్న పుట్టపర్తి