
సాక్షి, నేలతిమ్మాయిపల్లి: 'ప్రజాసంకల్పయాత్ర'లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్ జగన్ అభిమానులు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనడానికి వస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ అమెరికా కన్వీనర్ రత్నాకర్ తన టీం సభ్యులతో కలిసి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. రత్నాకర్ తొలిరోజు వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ దగ్గర నివాళులు అర్పించి వైఎస్ జగన్తో కలిసి.. ఇడుపులపాయ- వేంపల్లి, వేంపల్లి-నేలితిమ్మాయిపల్లి వరకు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్నారు.
గతంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ఏపీలో అన్ని కులాలు, మతాల వారి సమస్యలను తెలుసుకొని సీఎంకాగానే అందరికి న్యాయం చేశారని రత్నాకర్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ ఏపీ పరిస్థితి ఎటు పోతుందో, నిరుద్యోగ యువత పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మహానేత పరిపాలన మళ్లీ చూడాలనే వైఎస్ జగన్‌వెంట పాదయాత్రంలో పాల్గొంటున్నామన్నారు. గతంలో మహానేతకు పట్టం కట్టినట్టే ఇప్పుడు కూడా వైఎస్ జగన్‌కు తెలుగు ప్రజలు పట్టం కడతారన్నారు. వైఎస్‌ఆర్ కుటుంబం ఇచ్చిన మాట తప్పదు అనే గట్టి నమ్మకం అందరికి ఉందన్నారు. ప్రజాసంకల్పయాత్ర విజయవంతమై ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ సీఎం అయి ఏపీ, దేశ విదేశాల్లోని తెలుగువారికి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం వైఎస్సార్ జిల్లాలో ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన వైఎస్ జగన్ మొదటి రోజు 10 కిలోమీటర్లు, రెండో రోజు 12.8 కిలోమీటర్లు, మూడో రోజు 16.2 కిలోమీటర్లు నడిచారు.


Comments
Please login to add a commentAdd a comment