ravindra raju
-
వీఆర్వోలకు మేలు చేసేలా జీవోలు
సాక్షి, అమరావతి: వీఆర్వోలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం 154, 64, 6538, 166, 31 జీవోలు జారీ చేసిందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (వీఆర్వో అసోసియేషన్) అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు త్వరలో రాష్ట్రస్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో రవీంద్రరాజు మాట్లాడుతూ.. రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులలో వీఆర్వోలకు ప్రస్తుతం ఉన్న కోటా 40 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని, ఖాళీగా ఉన్న సీనియర్ సహాయకుల పోస్టులలో వన్‌టైమ్ సెటిల్మెంట్ ప్రకారం 70 శాతం పదోన్నతులను వీఆర్వోలతో భర్తీ చేయాలని కోరారు. సర్వే సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గ్రేడ్–2 వీఆర్వోల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, నాయకులు బాలాజీరెడ్డి, మౌళి భాష, లక్ష్మీనారాయణ, బాపూజీ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రవీంద్రరాజు
అమరావతి: ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు, జనరల్ సెక్రటరీ అప్పలనాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కొత్త కార్యవర్గంతో కలిసి ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో కలిశారు. కార్యక్రమంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వి ఎస్ దివాకర్, సీఆర్పి రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Suraksha: జగనన్న సురక్ష సూపర్ సక్సెస్ -
18న తాడేపల్లిగూడెంలో వీఆర్వోల సమావేశం
పెనుమంట్ర : ఈనెల 18న వీఆర్వోల జిల్లా సమావేశం తాడేపల్లిగూడెంలో జరుగుతుందని సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు బీహెచ్ రవీంద్రరాజు చెప్పారు. పెనుమంట్రలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం రైల్వేస్టేçÙన్ ఎదురుగా ఉన్న ధన రెసిడెన్సీలో ఆదివారం మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి రాష్ట్ర వీఆర్వోల సంఘ అధ్యక్షుడు బొత్స వత్సలనాయుడు, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొంటారన్నారు