బెయిల్‌పై విడుదలైన భరత్
హైదరాబాద్ : మద్యం మత్తులో పోలీసులపై దాడికి యత్నించిన హీరో రవితేజ సోదరుడు భరత్ బెయిల్‌పై విడుదలయ్యారు. రూ.5వేల పూచికత్తు, వ్యక్తిగత హామీతో కోర్టు అతడిని విడుదల చేసింది. గత రాత్రి మద్యం సేవించి మాదాపూర్‌లో కారును అడ్డంగా నిలిపి హంగామా సృష్టించిన భరత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై దాడికి యత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం మియాపూర్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చగా బెయిల్‌పై కోర్టు భరత్ విడుదలకు ఆదేశించింది.
కాగా అంతకు ముందు భరత్ తరపు న్యాయవాది మాట్లాడుతూ పోలీసులపై భరత్ దాడి చేయలేదన్నారు. పోలీసులే అనవసరంగా ఈ కేసులో ఇరికించి కేసు నమోదు చేశారని ఆరోపించారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న కానిస్టేబుల్‌ను భరత్ పక్కకు తప్పుకోమన్నాడని తెలిపారు. భరత్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయవాది అన్నారు.