
హీరో రవితేజ సోదరుడు భరత్ అరెస్ట్
హైదరాబాద్ : ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు భరత్ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున అతను మద్యం మత్తులో పోలీసులపై విరుచుపడ్డాడు. అరగంటపాటు రోడ్డుపై హంగామా సృష్టించటంతో భరత్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గతంలో భరత్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరైన అతడు అప్పట్లో మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.