షోరూమ్‌లో కారు చోరీ
రావులపాలెం :
తాళాలు వేసి ఉన్న ఒక కార్ల షోరూమ్ షెట్టర్ తాళం పగులగొట్టి కారును దొంగలించిన ఉధంతమిది. వివరాల ప్రకారం స్థానిక అరటి మార్కెట్ యార్డుకు వెళ్లే దారిలో ఉన్న మారుతి సుజికీ షోరూమ్‌లో సిబ్బంది ఎప్పటిలాగే బుధవారం రాత్రి షోరూమ్‌కు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. గురువారం వచ్చి చేసే సరికి షోరూమ్ ఒక వైపు షెట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.
షోరూమ్‌లో అమ్మకానికి ఉంచి మారుతి షిఫ్ట్ డిజైర్ మాగ్మా గ్రీన్ కలర్ కారును దొంగలు తీసుకుపోయినట్టు దీనిని విలువ సుమారు రూ. 8లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సంఘటన ప్రాంతాన్ని సీఐ పీవీ రమణ, ఎస్సై పీవీ త్రినాథ్‌లు పరిశీలించారు. కాకినాడ నుండి క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. షోరూమ్ నిర్వహకులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దర్యాప్తులో భాగంగా కారు చోరీ చేసిన వ్యక్తుల ఆచూకీ కోసం జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు.