పెళ్లి కావడంలేదని తనువు చాలించాడు
జోగిపేట: పెళ్లి సంబందాలు కుదరడం లేదనే మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా జోగిపేట మండలం రాయిపాడ్లో చోటుచేసుకుంది. రాయపాడ్ ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చాకలి అనిల్ (30) గత కోంత కాలంగా అనేక పెళ్లి సంబంధాలకు వెళ్లాడు. ఎక్కడా అమ్మాయి కుదరకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు.
గమనించిన కుటుంబ సభ్యులు 108 ద్వారా అనిల్ ను సంగారెడ్డి అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గాందీ అసుపత్రికి తరలించారని వైద్యులు సూచించారు. గాంధీలో చికిత్స పొందుతూ అనిత్ శుక్రవారం అర్దరాత్రి మతి చెందాడు. శనివారం శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం మతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశామని ఎస్ఐ తెలిపారు. మతికి తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.