శతమానం ప్రగతి
రాజోలు బాలుర ఉన్నత పాఠశాలకు వందేళ్లు
శతాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహణ
ఉన్నత స్థాయిలో పూర్వ విద్యార్థులు
రాజోలు :
అనేక మందిని ఉత్తములుగా తీర్చిదిద్దిన రాజోలు ఉన్నత పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకుంది. ఇక్కడ వికసించిన విద్యాకుసుమాలు రాజకీయ, ఉద్యోగ, వైద్య, వ్యాపార, నిర్మాణ, శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగాలతో పాటు సినీనటులుగా, దర్శికులుగా, రచయితలుగా స్థిరపడ్డారు. 1916లో రాజోలులో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికి 100 ఏళ్లు పూర్తికావడంతో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, సీనియర్ న్యాయవాది పొన్నాడ హనుమంతురావు తదితరులు ఆలోచన చేశారు. మూడు నెలలుగా శ్రమించి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల చిరునామాలు, ఫో¯ŒS నంబర్లు సేకరించి ఈ ఉత్సవాలు నిర్వహించే దిశగా అడుగులు వేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు జాతీయ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారంభించి శతాబ్ది ఉత్సవాలు గుర్తుగా పాఠశాల ఆవరణలో శత వసంతాల స్థూపం ఆవిష్కరించనున్నారు. రెండో రోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, పరిచయం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఇంత వరకు పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయులందరినీ సత్కరించనున్నారు.
వికసించిన విద్యా కుసుమాలు
వందేళ్లు చరిత్ర పూర్తి చేసుకున్న రాజోలు బాలుర ఉన్నత పాఠశాలలో అనేక మంది విద్యాభ్యాసం పూర్తి చేసి ఖండాంతర ఖ్యాతిని గడించారు. సుప్రసిద్ధ కవి, రచయిత పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న 1920లో ఈ పాఠశాలలో చదివారు. కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామయ్య, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎ.వి.సూర్యనారాయణరాజు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి వల్లూరి కామేశ్వరరావు, యూఎస్ఏలో శాస్త్రవేత్త నల్లి సాల్మ¯ŒSరాజు, ప్రముఖ డైరెక్టర్ బండ్రెడ్డి సుకుమార్, ప్రముఖ గాయకుడు పి.బి.శ్రీనివాస్, ప్రపంచ గ్లాస్ కం పెనీ సెయింట్ గోబేయి¯ŒS మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ తనికెళ్ల, దూదర్శ¯ŒS డైరెర్టర్ భూపతి విజయ్‌కుమార్, శ్రీహరికోటలోని ఇస్రోలో డిప్యూటీ జనరల్ మేనేజర్ బిక్కిన ప్రసాద్, సత్యవాణి ప్రాజెక్స్, కనస్ట్రక్ష¯Œ్స ఎండీ పొన్నాడ సూర్య ప్రకాష్, ఏపీ జె¯ŒSకో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గుబ్బల చంద్రరావు, ఓఎన్జీసీ సీని యర్ ఎకౌంట్స్ ఆఫీసర్ తమ్మన ప్రసాద్ తదితరులు ఈ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసి ఉన్నతస్థాయికి ఎదిగారు.