RCI
-
ఆర్సీఐలో ఘనంగా ‘డీఆర్డీవో డే ’ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ)లో బుధవారం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీజీపీ తన పరిశోధన ‘వ్యతికరణం, వివర్తనం-ఓ కొత్త సిద్ధాంతం’పై ఈ సందర్భంగా సాంకేతిక ప్రదర్శన ఇచ్చారు. ఆర్సీఐ డెరైక్టర్ సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ... ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే శాస్త్ర పరిశోధనలు నిర్వహిస్తున్నందుకు డీజీపీ ని అభినందించారు. సమష్టి కృషితో ఆర్సీఐని ప్రపంచస్థా యి ప్రయోగశాలగా నిలబెట్టగలమన్నారు. సమస్యలను సమష్టిగా అధిగమిద్దాం శాంతిభద్రతల పరిరక్షణలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు సమష్టిగా కృషి చే యాలని డీజీపీ పిలుపునిచ్చారు. బుధవారం పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బం దితో పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆందోళనల వల్ల సిబ్బంది తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పటికీ సమర్ధవంతంగా పనిచేశారని డీజీపీ ప్రశంసించారు. శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీస్‌కే కౌముది, అదనపు డీజీలు ఏఆర్ అనురాధ, సురేంద్రబాబు, వీకే సింగ్, గోపికృష్ణ తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు. -
మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలి
సాక్షి, హైదరాబాద్: భారతదేశ రక్షణ రంగం స్వావలంబనలో కీలకపాత్ర పోషించిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని మాజీ రాష్ట్రపతి, ఆర్సీఐ వ్యవస్థాపక సంచాలకులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. 1988లో దేశంలోనే మొట్టమొదటి క్షిపణి ఉత్పత్తి సంస్థగా ఆవిర్భవించిన ఆర్సీఐ పాతికేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆర్సీఐ రజతోత్సవాల సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలాం మాట్లాడుతూ ఆర్సీఐ శాస్త్రవేత్తలు భవిష్యత్తును అంచనాకట్టి తమ పరిశోధనలను అందుకు తగ్గట్టుగా మలచుకోవాలని సూచించారు. సైబర్ యుద్ధ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దేశ రక్షణకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయడంలో దేశం వెనుకబడిపోరాదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. క్షిపణి రంగంలో ఆర్సీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా ఎదిగిందని సంస్థ సంచాలకులు సతీశ్‌రెడ్డి తెలిపారు. ఈ సంస్థ పుట్టుకే పృథ్వీ క్షిపణి విజయవంత ప్రయోగంతో మొదలైందని, ఆ తరువాత అగ్రరాజ్యాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో క్షిపణి వ్యవస్థలను తయారు చేయగలిగామని చెప్పారు. ఒకప్పుడు దాదాపు 50 కిలోల బరువుతో క్షిపణి నావిగేషన్ వ్యవస్థలు రూపొందించిన తాము ప్రస్తుతం వాటిని అత్యంత తక్కువ బరువుతోనే సిద్ధం చేయగలుగుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి సలహాదారు, డీఆర్డీవో సంచాలకులు డాక్టర్ అవినాశ్ చందర్, డీఆర్డీవో ఆర్ అండ్ డీ చీఫ్ కంట్రోలర్ వి.జి.శేఖరన్, సంస్థ మాజీ సంచాలకులు కె.వి.ఎస్.ఎస్. ప్రసాదరావు, వి.కె.సారస్వత్, ఎస్.కే.రే తదితరులు పాల్గొన్నారు. రజతోత్సవాల సందర్భంగా తయారు చేసిన సావనీర్‌ను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించగా, ఆర్సీఐ విజయాల వీడియో సీడీని కలాం ఆవిష్కరించారు. -
నేడు ‘ఆర్సీఐ’ రజతోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: దేశానికే గర్వకారణమైన రక్షణ పరిశోధన సంస్థ రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) రజతోత్సవాలకు సిద్ధమవుతోంది. దీన్ని పురస్కరించుకుని ఈనెల 26న కాంచన్‌బాగ్‌లోని ఆర్సీఐ ప్రధాన కేంద్రంలో జరిగే వేడుకలకు గవర్నర్ నరసింహన్‌తోపాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, రక్షణశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ హాజరుకానున్నారు. 1984లో కలాం ఆలోచనల మేరకు ఈ కేంద్రం ఏర్పాటుకు అంకురం పడగా, 1985 ఆగస్టు 3న అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ శంఖుస్థాపన చేశారు. 1988 ఆగస్టు 27న అప్పటి రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్ జాతికి అంకితమిచ్చారు. అబ్దుల్ కలాం, లెఫ్టినెంట్ జనరల్ వి.జె.సుందరం, కెవిఎస్ఎస్ ప్రసాదరావు, వి.కె.సారస్వత్, ఎస్.కె.రే, అవినాశ్ చందర్, ఎస్.కె.చౌదరీ లాంటి దిగ్గజ శాస్త్రవేత్తల నేతృత్వంలో పలు విజయాలు సాధించిన ఈ సంస్థకు ప్రస్తుతం జి.సతీశ్‌రెడ్డి సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు. అగ్ని, పృథ్వీలతోపాటు దేశీయ క్షిపణులన్నింటికీ అవసరమైన ఏవియానిక్స్ వ్యవస్థల డిజైనింగ్, తయారీ జరిగేది ఈ కేంద్రం లోనే. హైదరాబాద్‌లోని కాంచన్‌బాగ్‌లో ఉన్న ఆర్సీఐ రక్షణ రంగంలో స్వావలంబన సాధిం చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలకపాత్ర పోషిస్తోంది.