ready to collapse
-
ఇంటర్నెట్ ఇక ఆగిపోతుందా?
ప్రతివారికీ ఇప్పుడు చేతిలో ఇంటర్నెట్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి. సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, చివరకు క్రికెట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలన్నా కూడా అరిచేతిలో ఇంటర్నెట్ ఉండాల్సిందే. కానీ, అలాంటి ఇంటర్నెట్ సామర్థ్యం కేవలం ఎనిమిదేళ్లలో నిండిపోయి, అది కుప్పకూలే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు.. అన్నింటికీ నెట్‌ను అందించే కేబుళ్లు, ఆప్టికల్ ఫైబర్ల సామర్థ్యం ఎనిమిదేళ్లలో పూర్తిగా అయిపోతుందట. ఆ తర్వాత ఇక వాటినుంచి సమాచార ప్రసారం సాధ్యం కాదని చెబుతున్నారు. ఈ విషయం మీద లండన్‌లోని రాయల్ సొసైటీ ఈ నెలాఖరులో ప్రముఖ ఇంజనీర్లు, భౌతిక శాస్త్రవేత్తలు, టెలికం నిపుణులు, సంస్థలతో ఓ సమావేశం ఏర్పాటుచేసింది. అందులో పాల్గొన్న ప్రొఫెసర్ ఆండ్రూ ఎలిస్ ఈ బాంబు పేల్చారు. రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోందని, దాన్ని తట్టుకోవడం అస్సలు సాధ్యం ఆకవట్లేదని ఎలిస్ చెప్పారు. రోజురోజుకూ టెక్నాలజీ విస్తరించడం, ఎక్కువ మందికి, ఎక్కువ సామర్థ్యంతో నెట్ వాడుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. -
శ్రీకాళహస్తిలో భయం.. భయం..
శ్రీకాళహస్తిలోని అష్టోత్తర లింగ మండపంలో మండపం స్తంభం శుక్రవారం రాత్రి ఒకవైపు ఒరిగిపోయింది. దాంతో భక్తులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. మండపం ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. రాళ్లు కూడా కింద పడటంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ మండపానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈ మండపం కిందనుంచే క్యూలైన్ల ద్వారా భక్తులు ప్రధాన ఆలయానికి వెళ్తుంటారు. దీనికి మరమ్మతులు చేస్తున్నామని, ఎలాంటి ప్రమాదం ఉండబోదని అధికారులు అంటున్నారు. అయితే, ప్రముఖ వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో ఇంతకుముందు గాలిగోపురం కూలిపోయింది. దానికి ముందు కూడా అధికారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే చెప్పారు. కానీ అది కాస్తా కూలిపోయింది. అప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి కూడా చాలా సమయం పట్టింది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కట్టించిన గాలిగోపురం అప్పట్లో కూలిపోయింది. ఇప్పుడు అష్టోత్తర లింగ మండపం కూడా కూలిపోయే స్థితిలోనే ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
కూలిపోవడానికి సిద్ధంగా కాళహస్తి మండపం