నేనలా నటించను
అందాల ఆరబోతకు ఒక హద్దు ఉంటుంది. అవకాశం వచ్చింది కదా అని ఎలా పడితే అలా నటించడానికి తాను సిద్ధంగా లేను అంటోంది నటి విశాఖ సింగ్. కన్నాలడ్డు తిన్న ఆశయా చిత్రం ద్వారా ప్రాచుర్యం పొందిన ఈ బ్యూటీ మాట్లాడుతూ అవకాశాలు చాలా వస్తున్నాయని చెప్పింది. అయితే చిత్రాల సంఖ్య పెంచుకోవడానికి వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడం లేదని చెప్పింది. ఇటీవల ఒక బాలీవుడ్ నిర్మాత కాల్షీట్స్ అడుగుతూ కథ చెప్పడానికి వచ్చారని చెప్పింది.
అప్పుడాయన తెలుపు, ఎరుపు షార్ట్స్ ధరించి నటించాలని చెప్పారని దీంతో అవకాశమే వద్దు బయలుదేరండి అని చెప్పానని తెలిపింది. కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రాలు చేయాలని ఆశిస్తున్నానని, అసభ్యకరమైన దుస్తులతో నటించే చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించనని చెప్పింది. ప్రస్తుతం తమిళంలో వాలిబరాజా చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రం విడుదల తన దశను తిప్పిందని, ఈ వాలిభరాజ కూడా మంచిపేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.