reeta
-
Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్‌కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి... ‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా. గతంలో నటుడు సంజీవ్ కుమార్‌పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు. నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది. బలహీనులకు అందని విద్య ‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి. అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్‌వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి. ఆ ఇద్దరు ‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి. ఎన్నెన్నో అవమానాలు ‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి. -
గుడియాత్తంలో ప్రేమికుల ఆత్మహత్య?.. రీట ఇంటి సమీపంలో వ్యవసాయబావిలో
సాక్షి, చెన్నై: వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా నెల్లూరు జిల్లా పేటకు చెందిన వెంకటేశన్ కుమారుడు అజిత్‌కుమార్(26) పాల వ్యాపారం చేసేవాడు. ఆదివారం రాత్రి శెట్టికుప్పం కాలియమ్మన్ ఆలయం వెనుక ఉన్న నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అజిత్‌కుమార్ చెప్పులు, సెల్‌ఫోన్ కుంట సమీపంలో ఉండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇదే గ్రామానికి చెందిన పెరుమాల్ కుమార్తె రీట(22) కాట్పాడిలోని ఓ ప్రైవేటు టీచర్ ట్రైనింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నెల్లూరు పేట పంచాయతీ వార్డు సభ్యురాలిగా కూడా ఉంది. ఇదిలా ఉండగా రాత్రి 2 గంటల సమయంలో రీట ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఒకే రోజు ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఏడాదిగా రోజూ రూ.లక్షల్లో డిపాజిట్) -
మహిళా పారిశ్రామికవేత్త బలవన్మరణం
సాక్షి, చెన్నై : మహిళా పారిశ్రామికవేత్త చెన్నైలో గురువారం బలన్మరణానికి పాల్పడ్డారు. లాన్స్ టయోటా డీలర్ కో– డైరెక్టర్‌గా రీటా లింగగా ఆమెను గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై నుంగంబాక్కం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వివరాలు.. తమిళనాడులోని లాన్స్ టయోటా కార్ల షోరూమ్‌ల ఏర్పాటులో చెన్నై నుంగంబాక్కంకు చెందిన లంక లింగం కుటుంబం ›ప్రధాన డీలర్‌గా వ్యవహరిస్తోంది. దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా లింగం వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య రీటా కో– డైరెక్టర్‌గా ఉన్నారు. నుంగంబాక్కంలో అతి పెద్ద భవనంగా వీరి నివాసం ఉంది. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేచి రీటా కార్యాలయానికి వెళ్లేవారు. గురువారం 11 గంటలైనా ఆమె గది తలుపులు తెరచుకోలేదు. ఆందోళన చెందిన ఇంటి పనిమనిషి ఏసుపాదం నుంగంబాక్కం పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతుండడాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. రెండు, మూడు రోజులుగా ఆమె తీవ్ర మనో వేదనతో ఉన్నట్టుగా విచారణలో తేలింది. అలాగే ప్రస్తుతం కార్ల వ్యాపారం మందగించడంతో నష్టాలు వచ్చాయా, అప్పులు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తంచేసే వాళ్లు సైతం ఉండడంతో ఆదిశగా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. -
ప్రాణం తీసిన ఆర్థిక ఇబ్బందులు
బంజారాహిల్స్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సుధీర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన రమేష్ ఛత్రి(45), రీటా(42) దంపతులు యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో ఉంటూ స్థానిక ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్‌లో పని చేస్తున్నారు. రమేష్‌కు గతంలోనే ఓ యువతితో వివాహం కాగా కుమారుడు కూడా ఉన్నాడు. ఆరేళ్ల క్రితం మొదటి భార్యను వదిలేసిన అతను అప్పటికే వివాహం చేసుకొని ఓ కుమార్తె ఉన్న రీటాను రెండో పెళ్లి చేసుకున్నాడు. రీటా, రమేష్ దంపతులు గది అద్దెకు తీసుకొని ఉంటుండగా రీటా కుమార్తె మరో చోట ఉంటోంది. గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలు తీవ్రం కావడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పని ముగించుకొని గదికి వచ్చారు. రాత్రి 9.20 గంటల ప్రాంతంలో వీరి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తుండటాన్ని గుర్తించిన ఇంటి యజమాని జహంగీర్ షరీఫ్ రమేష్ సోదరుడు రతన్ ఛత్రికి ఫోన్ చేశాడు. అక్కడికి వచ్చిన అతను ఇంటి యజమాని సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. రమేష్, రీటా మంటల్లో దగ్ధమై విగతజీవులుగా మారారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. వీరిద్దరూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. గతమూడు నెలలుగా అద్దె కూడా ఇవ్వడం లేదని ఇంటి యజమాని తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రీటా.. హ్యాట్సాఫ్!
రీటా.. హ్యాట్సాఫ్! – 11 ఏళ్లు సేవలందించిన పోలీసు జాగిలం – ఘనంగా రిటైర్డ్మెంట్ ఫంక్షన్ చిత్తూరు (అర్బన్) : ఇక్కడ రిటైర్డ్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్న ఈ జాగిలం పేరు రీటా. జిల్లా పోలీసుశాఖలో ఎన్నో కేసులను ఛేదించేందుకు సహకరించింది. 2005లో జన్మించిన రీటా గ్రేహండ్స్ యూనిట్లో 2009 వరకు సేవలు అందించింది. 2009 నుంచి 2016 వరకు జిల్లాలో డాగ్‌స్వా్కడ్ బృందంలో ఉంది. 11 ఏళ్లపాటు అనేక కేసుల పరిష్కారానికి తోడ్పడింది. ఆదివారం ఈ జాగిలానికి వీడ్కోలుసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు దీని సేవలను గుర్తుచేసుకున్నారు. అలాగే రీటా సంరక్షకుడిగా ఉన్న శ్రీహరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రమణయ్య, ఆర్ఐ సుజుద్దిన్, జిల్లా డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.