Registrar offices
-
ఏపీలో పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఏసీబీ తనిఖీలు
-
ఏపీలో ఏసీబీ మెరుపుదాడులు
-
ఏపీలో ఏసీబీ మెరుపు దాడులు
ఏపీలోని 13 జిల్లాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో చేపట్టిన ఏసీబీ సోదాలు ముగిశాయి. ఈ దాడుల్లో 10.34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏబీసీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రజల నుంచి 14400 టోల్ ఫ్రీ నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదులతో మెరుపుదాడులు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. విజయనగరం: విజయనగరం వెస్ట్‌జోన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రిజిస్ట్రేషన్‌కి వస్తున్న వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేస్తున్నామని ఏసీబీ డిఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. ఎనిమిది మంది అనధికార డాక్యుమెంట్ రైటర్స్ నుంచి రూ.50వేలు, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది దగ్గర నుంచి రూ.11 వేలు నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతపురం: అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ మూర్తి నుంచి రూ.2.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తో పాటు, కొంతమంది ప్రైవేటు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తూర్పుగోదావరి: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించారు.దాడులు జరుగుతున్నాయని ముందుగానే సమాచారం అందడంతో కొందరు అధికారులు తప్పించుకున్నారు. కాకినాడ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కార్యాలయ సిబ్బంది వద్ద అనధికారికంగా లెక్కల్లో లేని రూ.1,29,640 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని విచారించారు. ప్రజల నుంచి ‘14400 కాల్ సెంటర్’ కు వచ్చిన ఫిర్యాదులతో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోదాలు చేపడుతున్నామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ వెల్లడించారు. ప్రకాశం: జిల్లాలోని సింగరాయకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలువురి సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విశాఖపట్నం: అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు సమక్షంలో రూ. 83,660 నగదును సీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రికార్డులను అడిషనల్ ఎస్పీ షకీలా భాను, ఏసీబీ డీఎస్పీ రంగరాజు తనిఖీలు చేశారు. పలువురి సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు. శ్రీకాకుళం: కాశీబుగ్గ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కార్యాలయ రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. పలువురి సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. పశ్చిమగోదావరి: జిల్లాలోని కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.84 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో ఉన్న ముగ్గురు డాక్యు మెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. గుంటూరు: తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఆకస్మిక దాడుల్లో కార్యాలయంలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.16,250 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
బ్రోకర్లకు షాక్: ఆ ఆఫీసుల్లోకి అనుమతించరు!
సాక్షి, చెన్నై(టీ.నగర్): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఇకపై బ్రోకర్లను నిషేధిస్తూ తమిళనాడు రిజిస్ట్రార్ శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో బ్రోకర్ల కార్యకలాపాలు అధికంగా ఉంటూ వస్తున్నాయి. దీంతో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు పలువురు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి మద్రాసు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలయింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరు గురించి కూడా న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలావుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రోకర్లను రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రార్ శాఖ నిషేధం విధించింది. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఈ చర్యలు అమలులోకి రానుంది. మార్చి నెల నుంచి ఆస్తులు కొనుగోలు చేసేవారు, విక్రయించేవారిని మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి అనుమతిస్తారని, అక్కడ బ్రోకర్లు కనిపిస్తే పోలీసుల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటారని తమిళనాడు రిజిస్ట్రార్ శాఖ వెల్లడించింది. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో కొత్త సాఫ్ట్వేర్ రూపకల్పన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల రిజిస్ట్రేషన్లు, యాజమాన్య హక్కుల బదలాయింపు ప్రక్రియను ప్రభుత్వం సరళతరం చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలను అనుసంధానం చేస్తోంది. ఈ మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నరెవెన్యూ శాఖ.. అతి త్వరలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానంపై జాయింట్ కలెక్టర్-1 చంపాలాల్ ‘సాక్షి ప్రతినిధి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వెబ్‌ల్యాండ్ సాఫ్ట్వేర్ ఇకపై మ్యుటేషన్ల జారీ ప్రక్రియలో జాప్యం జరగదు. స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణమే ఆ వివరాలన్నీ ఆన్లైన్లో తహసీల్దార్ కార్యాలయానికి చేరుతాయి. ఆ వివరాలను పహాణీలోని సమాచారంతో సరి పోల్చుకున్న వెంటనే మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తక్షణమే కొత్త యజమాని వివరాలు పహాణీలో నమోదవుతాయి. తహసీల్దార్ కార్యాల యం చుట్టూ తిరగాల్సి ఉండదు. ఈ మేరకు ఇప్పటికే ‘వెబ్‌ల్యాండ్’ సాఫ్ట్‌వేర్‌ను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) డిజైన్ చేశారు. ప్రధాన సర్వర్ కూడా అక్కడే ఉంటుంది. కొత్త సాఫ్ట్‌వేర్‌ను జిల్లావ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ ఆఫీసులకు ఇటీవల అనుసంధానం చేశాం. ఈ విధానం అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి. వీటిని అధిగమించేం దు కు సమయం పట్టవచ్చు. ముఖ్యంగా పహాణీల్లో అక్షర దోషాలుంటే సాఫ్ట్వేర్ అనుమతించదు. ఈ క్రమంలో రికార్డుల్లో తప్పొప్పులను పరిశీలించి, సవరించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశిం చాం. ఈ సవరణ పూర్తికాగానే కొత్త విధానాన్ని లాంఛనంగా ప్రారంభిస్తాం. సర్కారు స్థలాల పరిరక్షణ నగర శివారు విలువైన ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. కోట్ల విలువైన భూ ములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ భూముల గుర్తింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ఈ డ్రైవ్ పంద్రాగస్టు నాటికి ముగిసింది. తహసీల్దార్ల నుంచి స్థలాల సమాచారాన్ని సేకరిస్తున్నాం. వివరాలు అందగానే వాటి పరిరక్షణకు నడుంబిగిస్తాం. విలువైన భూములు అక్రమార్కుల చెరలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఇప్పటికే రూ.2 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో స్థలాల చుట్టూ ప్రహరీలు, హద్దురాళ్లు, ముళ్ల కంచెలు నిర్మిస్తాం. ఈ బాధ్యతల ను రెండు ఏజెన్సీలకు అప్పగించే యోచనలో ఉన్నాం. జిల్లా గృహ నిర్మాణ శాఖ, సాంఘిక సంక్షేమ (ఇంజనీరింగ్) విభాగాలకు ఈ పనులను కట్టబెట్టనున్నాం.