పార్ట్ టైం లెక్చరర్స్‌ను రెగ్యులరైజ్ చేయాలి
ఒంగోలు వన్‌టౌన్: ఆంధ్రప్రదేశ్‌లో 1000 మందికిపైగా ఒకేషనల్ పార్ట్ టైం జూనియర్ లెక్చరర్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం మోసగిస్తోందని.. వారి ఉద్యోగ భద్రతకు ప్రతిపక్ష నేతగా కృషి చేయాలని తాళ్లూరు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నేత టి.లక్ష్మయ్య జగన్‌కు వినతిపత్రం అందించారు. గత 20 సంవత్సరాలుగా సర్వీస్‌లో ఉండి గంటకు వేతనం ప్రాతిపదికన పని చేస్తున్నారన్నారు. వీరిని రెగ్యులర్ చేయటం ద్వారా ఉద్యోగ భద్రత కల్పించవచ్చని చెప్పారు.
ఉద్యాన విస్తరణాధికారుల నియామకాలు చేపట్టాలి
ఒంగోలు వన్‌టౌన్: ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనశాఖలో ఇంత వరకు ఒక్క ఉద్యాన విస్తరణాధికారి పోస్ట్ నియామకం కూడా జరగలేదని అద్దంకి హార్టికల్చరల్ ఎంపీఈఓ ఎ.స్వర్ణలత జగన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎంపీఈఓలు ఒక్కొక్కరు నాలుగు నుంచి ఐదు మండలాల పరిశీలకులుగా ఉన్నారన్నారు. 20 వేల నుంచి 25 వేల ఎకరాల భూములను పరిశీలించటం కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. ఉద్యాన విస్తరణాధికారి నియామకాలు చేపట్టడం ద్వారా బీఎస్సీ డిప్లమో (హార్టికల్చర్) పూర్తి చేసిన సుమారు వెయ్యి మందికిపైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలొస్తాయని వివరించారు.