Regulatory Board
-
ఫేస్బుక్ మొండి వైఖరి..! కంపెనీపై భారీగా అక్షింతలు..!..!
లండన్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న ఫేస్బుక్ పలు విషయాల్లో దిగజారి ప్రవర్తిస్తోంది. అమెరికన్ సోషల్ మీడియా దిగ్గజం గిఫ్(GIF) ప్లాట్‌ఫాం జిఫీ(Giphy) కొనుగోలుపై విచారణ సమయంలో బ్రిటిష్ రెగ్యులేటరీ సంస్థ సీఎమ్ఏ విధించిన ఆర్డర్‌ను ఫేస్బుక్ ఉల్లంఘించింది. దీంతో బ్రిటన్ రెగ్యులేటరీ ఫేస్‌బుక్‌పై సుమారు 50.5 మిలియన్ జీబీపీ (బ్రిటిష్ పౌండ్లు) (సుమారు రూ. 520 కోట్లు) జరిమానా విధించింది. కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎమ్ఏ) ఆర్డర్‌ను పాటించడంలో ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగానే విఫలమైందని రెగ్యులేటరీ ఆరోపించింది. బ్రిటిష్పెనాల్టీ చట్టం ముందు ఫేస్‌బుక్‌కు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని హెచ్చరించింది. చట్టం ముందు అందరు సమానులే అంటూ ఫేస్‌బుక్‌కు సీఎమ్ఏ ఆక్షింతలు వేసింది. ఫేస్బుక్ చేసిన నిర్వాకంతో ఇతర కంపెనీలు కూడా స్ఫూర్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ, ఫేస్బుక్ అవసరమైన సమాచారాన్ని అందించలేదని సీఎమ్ఏ చెప్పింది. Giphy కంపెనీతో ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగానే ఇంటిగ్రేట్ అపరేషన్స్ పాటించడంలో వైఫల్యమైందనిన సీఎమ్ఏ పరిగణించింది. ఫేస్బుక్ వ్యాపార పద్ధతుల విషయంలో బ్రిటన్ చట్టసభ సభ్యుల నుంచి భారీ విమర్శలకు గురైంది. రిక్రూట్మెంట్ నియమాలను పాటించినందుకు సివిల్ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి ఫేస్బుక్ 14.25 మిలియన్ల డాలర్లను (సుమారు రూ. 105 కోట్లు) చెల్లించడానికి అంగీకరించిన తర్వాత ఫేస్బుక్ ఇలా ప్రవర్తించడం దారుణమని సీఎమ్ఏ సీనియర్ డైరక్టర్ జోయోల్ బ్యామ్ఫార్డ్ అన్నారు. స్పందించిన ఫేస్బుక్..! సీఎమ్ఏ విధించిన జరిమానాపై ఫేస్బుక్ స్పందించింది. సీఎమ్ఏ తీసుకున్న అన్యాయమైన నిర్ణయంతో మేము తీవ్రంగా విభేదిస్తున్నామని పేర్కొంది. సీఎమ్ఏ తీసుకున్న నిర్ణయంపై ఫేస్బుక్ సమీక్ష చేపడుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: ఈ సెక్టార్లలోని ఉద్యోగులకు జీతాలు భారీగా పెరగడం ఖాయమేనా? -
Google: గూగుల్‌కు షాకు మీద షాకులు
South Korea Fined Google: టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు వరుసబెట్టి దెబ్బలు తగులుతున్నాయి. ఈమధ్యే పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా గూగుల్-యాపిల్ ప్లేస్టోర్ మార్కెటింగ్‌కు భారీ దెబ్బ కొట్టింది దక్షిణ కొరియా. తాజాగా గూగుల్‌కు ఏకంగా 207 బిలియన్ వన్ల(176 మిలియన్ డాలర్ల) భారీ జరిమానా విధించి వెనువెంటనే మరో దెబ్బేసింది. ఆల్ఫాబెట్ కంపెనీకి చెందిన గూగుల్‌కు దక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ భారీ జరిమానా విధించింది. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ పోటీలో నైతిక విలువల్ని గూగుల్ విస్మరించిందని, ఆధిపత్యపోరులో ఇతర కంపెనీలను నిలువరించడం ద్వారా పోటీతత్వానికి విరుద్ధంగా వ్యవహరించిందని కొరియా ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (KFTC) చెప్తోంది. ఈ మేరకు 176 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంతో పాటు.. కోర్టుల్లో కౌంటర్ దాఖలు చేయడానికి వీల్లేకుండా వెంటనే ఆ జరిమానాను కట్టాలంటూ గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: టెక్ దిగ్గజాల కమిషన్ కక్కుర్తికి దెబ్బ ఫోన్లలో ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగించకుండా గూగుల్ అడ్డుకుంటోందన్న లోకల్ స్మార్ట్‌ఫోన్ మేకర్ల ఆరోపణలపై కేఎఫ్టీసీ దర్యాప్తు చేసింది. ఈ మేరకు దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలడంతో దక్షిణ కొరియా ఇలా భారీ జరిమానా విధించింది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ఫ్రాన్స్ రెగ్యులేటరీ అథారిటీ కూడా గూగుల్ న్యూస్‌లో ‘కాపీ రైట్’ వివాదంలో గూగుల్‌కు భారీ జరిమానా విధించగా.. చెల్లించే ప్రసక్తే లేదంటూ కౌంటర్ దాఖలు చేసింది టెక్ దిగ్గజం. ప్రస్తుతం ఆ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. ఇక నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు రష్యా కూడా రెండుసార్లు గూగుల్‌కు జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. చదవండి: సొంత దేశంలోనే గూగుల్‌కు భారీ షాక్ -
పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు
చెల్లింపు వ్యవస్థల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించి ఆరుగురు సభ్యులతో పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుతమున్న బోర్డ్ ఆఫ్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ స్థానంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఉండే ఈ బోర్డుకు.. ఆర్బీఐ గవర్నర్ సారథ్యం వహిస్తారు.