లండన్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ పలు విషయాల్లో దిగజారి ప్రవర్తిస్తోంది. అమెరికన్ సోషల్ మీడియా దిగ్గజం గిఫ్(GIF) ప్లాట్‌ఫాం జిఫీ(Giphy) కొనుగోలుపై విచారణ సమయంలో బ్రిటిష్ రెగ్యులేటరీ సంస్థ సీఎమ్‌ఏ విధించిన ఆర్డర్‌ను ఫేస్‌బుక్ ఉల్లంఘించింది. దీంతో బ్రిటన్ రెగ్యులేటరీ ఫేస్‌బుక్‌పై సుమారు 50.5 మిలియన్ జీబీపీ (బ్రిటిష్ పౌండ్లు) (సుమారు రూ. 520 కోట్లు) జరిమానా విధించింది.
కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎమ్‌ఏ) ఆర్డర్‌ను పాటించడంలో ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగానే విఫలమైందని రెగ్యులేటరీ ఆరోపించింది. బ్రిటిష్‌పెనాల్టీ చట్టం ముందు ఫేస్‌బుక్‌కు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని హెచ్చరించింది. చట్టం ముందు అందరు సమానులే అంటూ ఫేస్‌బుక్‌కు సీఎమ్‌ఏ ఆక్షింతలు వేసింది. ఫేస్‌బుక్ చేసిన నిర్వాకంతో ఇతర కంపెనీలు కూడా స్ఫూర్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ, ఫేస్బుక్ అవసరమైన సమాచారాన్ని అందించలేదని సీఎమ్‌ఏ చెప్పింది. Giphy కంపెనీతో ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగానే ఇంటిగ్రేట్ అపరేషన్స్ పాటించడంలో వైఫల్యమైందనిన సీఎమ్‌ఏ పరిగణించింది.
ఫేస్‌బుక్ వ్యాపార పద్ధతుల విషయంలో బ్రిటన్ చట్టసభ సభ్యుల నుంచి భారీ విమర్శలకు గురైంది. రిక్రూట్‌మెంట్ నియమాలను పాటించినందుకు సివిల్ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి ఫేస్‌బుక్ 14.25 మిలియన్ల డాలర్లను (సుమారు రూ. 105 కోట్లు) చెల్లించడానికి అంగీకరించిన తర్వాత ఫేస్‌బుక్ ఇలా ప్రవర్తించడం దారుణమని సీఎమ్‌ఏ సీనియర్ డైరక్టర్ జోయోల్ బ్యామ్‌ఫార్డ్ అన్నారు.
స్పందించిన ఫేస్‌బుక్..!
సీఎమ్‌ఏ విధించిన జరిమానాపై ఫేస్‌బుక్ స్పందించింది. సీఎమ్‌ఏ తీసుకున్న అన్యాయమైన నిర్ణయంతో మేము తీవ్రంగా విభేదిస్తున్నామని పేర్కొంది. సీఎమ్‌ఏ తీసుకున్న నిర్ణయంపై ఫేస్‌బుక్ సమీక్ష చేపడుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
చదవండి: ఈ సెక్టార్లలోని ఉద్యోగులకు జీతాలు భారీగా పెరగడం ఖాయమేనా?
Facebook: నువ్వేం తోపు కాదు..! చట్టం ముందు అందరు సమానులే..!
Published Wed, Oct 20 2021 9:25 PM | Last Updated on Wed, Oct 20 2021 10:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment