న్యాయం కోసం
నిడదవోలు : తనను ప్రేమించి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడితో వివాహం జరిపించాలని ఓ యువతి నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖ జిల్లా భీమునిపట్నంకు చెందిన సిర్రా దివ్యశ్రీ, నిడదవోలు చెందిన కె.విలియం రాజారత్నపాల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రాజారత్నపాల్ పెళ్లి చేసుకుంటానని దివ్యశ్రీని నమ్మించాడు. అయితే పెళ్లి విషయం వచ్చేసరికి తనను నిరాకరించాడని దివ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. రాజారత్నపాల్ కుటుంబసభ్యులు కూడా అధిక మొత్తంలో కట్నం ఇస్తేనే తనతో పెళ్లి చేస్తామని చెప్పారన్నారు. ఈ క్రమంలో రాజారత్నపాల్కు మరో పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారని తెలిసిన దివ్యశ్రీ ఇటీవల విశాఖ జిల్లా భీమునిపట్నం పోలీస్స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా రాజారత్నపాల్కు జంగారెడ్డిగూడెంకు చెందిన మరో యువతితో పెళ్లి కుదిరింది. నిడదవోలులోని కృపాధార లూథర¯ŒS చర్చిలో ఈనెల 26న వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసిన దివ్యశ్రీ కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడకు వచ్చింది. పట్టణ బీఎస్పీ నాయకులు మద్దతు ఇవ్వడంతో పట్టణ పోలీస్స్టేçÙ¯ŒS ఎదుట నిరసన వ్యక్తం చే సింది. తనకు రాజారత్నపాల్తో వివాహ ం జరిపించాలని డిమాండ్ చేసింది. రాజారత్నపాల్కు వేరే యువతితో జరిగే వివాహాన్ని ఎలాగైనా ఆపుతామని వీరంతా పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీఎస్పీ నాయకులు బోను కృష్ణ, చెల్లాబత్తుల సత్యనారాయణ, గుమ్మాపు చిత్రసీన, బయ్యే మునీంద్ర, కాకర రమణ ఆమెకు మద్దతుగా నిలిచారు.