నగరంలో నారీభేరి
మన మహిళల ఆత్మగౌరవ బావుటాను ఎగరేసింది.. ఉమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ! ఈ నెల 22వ తేదీ వరకు సాగే ఈ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ వేదిక నుంచి దేశవిదేశాలకు చెందిన ఎందరో నారీమణులు తమ గెలుపువాణిని వినిపిస్తున్నారు. విశ్వవనితలకు స్ఫూర్తినిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్.. ప్రొఫెసర్, విమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ చైర్పర్సన్ అండ్ డెరైక్టర్ రేఖాపాండే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవం వెనుక విశేషాలను ‘సిటీ ప్లస్’తో రేఖాపాండే పంచుకున్నారు.
- సరస్వతి రమ
ఇంటర్నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ కాంగ్రెస్ ఆఫ్ విమెన్.. అనే ఆర్గనైజేషన్ మూడేళ్లకోసారి ఒక్కో దేశంలో సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 1981లో జరిగిన ఈ సంస్థ తొలి సవూవేశానికి ఇజ్రాయిల్ వేదికైంది. అమెరికా, కోస్టారికా, కెనెడా, ఉగాండా.. ఇలా ఎన్నో ప్రపంచ దేశాలు తిరిగిన ఈ సవూవేశాలు.. ఈ ఏడాది వున హైదరాబాద్‌లో జరుగుతున్నారుు. గతంలో పలు దేశాల్లో జరిగిన కాన్ఫరెన్స్‌లకు ఏ వూత్రం తీసిపోకుండా సవూవేశాలు నిర్వహిస్తున్నారు.
అన్నీ అధిగమించి..
విమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువుతి వున దేశానికి తెచ్చింది రేఖాపాండేనే. కార్యక్రవుం ఇండియూలో నిర్వహించడానికి 2011లోనే ఆమోదవుుద్రపడింది. అరుుతే ఆ ఏర్పాట్లలో వూత్రం అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యూరుు. మొదట ఈ సవూవేశానికి వుూడున్నరవేల వుంది అతిథులను ఆహ్వానించాలనుకుని హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్‌ను ఖాయం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయు ఘటన ఎఫెక్ట్ విదేశీ వనితలను చాలా వుంది కాన్ఫరెన్స్‌కు దూరం చేసింది. లేటెస్ట్గా ఎబోలా కారణంగా ఆఫ్రికా దేశాలకు చెందినవారి వీసాలన్నీ రద్దయ్యూరుు. అన్ని అడ్డంకులు దాటుకుని వేదికెక్కిన ఈ కాన్ఫరెన్స్‌కు వెరుు్య వుంది అతిథులు హాజరుకానున్నారు. వీళ్లలో 58 దేశాల నుంచి 200 వుంది డెలిగేట్స్ రానున్నారు.
వావ్.. హైదరాబాద్
‘మా ఈ విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్ థీమ్.. జెండర్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్! అసలు ఈ కాన్ఫరెన్స్‌ను మన దేశంలో పెట్టాలని జెండర్ ఆన్ హిస్టరీ, జెండర్ ఆన్ వయొలెన్స్, జెండర్ ఆన్ కల్చర్, జెండర్ ఆన్ హెల్త్, జెండర్ ఆన్ మీడియా.. లాంటి ఇష్యూస్ అన్నీ చర్చకు రానున్నాయి. వీటికి సంబంధించి అన్ని దేశాల నుంచి మొత్తం 850 ప్రెజెంటేషన్ పేపర్లు వచ్చాయి. ఇక్కడకు వచ్చిన విదేశీ వనితలు హైదరాబాద్ ఎరుుర్‌పోర్ట్‌ను చూడగానే అమేజింగ్ ప్లేసంటూ ఆశ్చర్యపోతున్నారు. సిటీలోని చారిత్రక కట్టడాలు చూడాలనుకుంటున్నారు. అందుకే వాళ్ల కోసం చివరి రెండు రోజులు టూర్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు ప్రొఫెసర్ రేఖాపాండే.
నెదర్లాండ్స్‌లో ప్రేరణ
కొన్నేళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో జరిగిన ఫ్యామిలీ కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యారు రేఖాపాండే. అక్కడికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రముఖులూ వచ్చారు. ఆ సదస్సు చూసి ముగ్దురాలైన రేఖా పాకిస్థానీ డెలిగేట్ ఫారూఖ్‌తో ‘ఇలాంటి కాన్ఫరెన్స్ ఇండియాలోనో, పాకిస్థాన్‌లోనో జరిగితే ఎంత బాగుంటుంది?’ అని అన్నారట. అందుకాయున ‘విమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ అని ఇంకోటి ఉంది.. అది జరిగితే నిజంగానే చాలా గ్రేట్‌గా ఉంటుంది. మీకు ఆసక్తి ఉంటే నేను హెల్ప్ చేస్తాను’ అన్నారట ఫారూఖ్. అనడమే కాదు దానికి సంబంధించిన ప్రాసెస్‌లో ఆయున సాయుం కూడా చేశారట. అయితే ఆ ఏడాది అది ఆస్ట్రేలియూకు దక్కింది. ఏమైతేనేం చివరకు ఈ ఏడాది విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్ హైదరాబాద్ చేరుకుని వున వేడుకైంది.