బాహుబలి... సీన్ బై సీన్..
⇒స్టన్నింగ్ షాట్స్, స్పెక్టాక్యులన్ సీన్స్.
⇒మూవీ ప్రారంభం, పెద్ద శబ్దం.. జీవనది మళ్లీ వచ్చిందా.. అన్నంతగా సైలెంట్.
⇒జలపాతమా.. కాదు కాదు.. అలాంటి వాతావరణమే.
⇒ఏం లేదు.. రమ్యకృష్ణ ఎంట్రీ. అంతలోనే శివుడిగా ప్రభాస్ ఎంట్రీ.
⇒ప్రభాస్ శివుడిగా కొనసాగుతాడు.
⇒శివుడు దేనికో వెతుకుతూ ఒక కొండకు వెళ్తాడు.
⇒ధీరవ అనే చోట అందాల భామ తమన్నా కనిపిస్తుంది.
⇒అవంతిక బ్యూటీ కాదు. శివుడితో పాటు యుద్ధం చేసే వనిత.
⇒ఒక్కసారిగా రాణి దేవసేన అనుష్క తెరమీదికి వస్తుంది.
⇒కరికాల కట్టప్ప ఎంట్రీ ఇస్తాడు. ఆయనే సత్యరాజ్.
⇒డైలాగ్స్.. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ప్రజల్ని ఆకట్టుకున్నాయి.
⇒అందులోంచి ఓ డైలాగ్ చూస్తే.. "మాట ఇచ్చిన వాళ్లు చనిపోవచ్చు కానీ.. మాట నిలిచిపోతుంది".
⇒అవంతిక, శివుడు మధ్య జరిగే సన్నివేశం కలయా.. నిజమా.. అనేంతగా ఉంది.
⇒అందాల భామ తమన్నాను యుద్ధ వనితగా చూపించాడు రాజమౌళి.
⇒అంతలోనే భల్లాలదేవగా.. రానా దగ్గుపాటి గ్రాండ్ ఎంట్రీ.
⇒రానా దగ్గుపాటి నటన.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
⇒ట్రైలర్ కంటే ఎక్కువగా.. దానికి మరింత రెట్టింపుగా ఉంది.
⇒కరికాల కట్టప్ప భల్లాల దేవ ప్రాణాలు కాపాడుతాడు. రాణి దేవసేనను విడుదల చేస్తాడు. ఇందుకు భల్లాలదేవ ఒప్పుకోడు.
⇒అంతలోనే నాజర్ ఎంట్రీ. వావ్.. నిజంగా ఆయన ఎంట్రీ ఓ అద్భుతం.
⇒భల్లాలదేవకు బంధువు అడవి శేషు..
⇒అనుష్క (రాణి దేవసేన) సంకెళ్లతో బంధించి ఉంటుంది. ఆ సీన్లో అనుష్క దుస్తులు కూడా మురికిగా ఉంటాయి.
⇒అనుష్క అక్కడే ఒక డైలాగ్ చెబుతుంది..
⇒"పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చి దాన్ననుకున్నావా కట్టప్పా.. చితి పేరుస్తున్నాను.. ఆ భల్లాల దేవుణ్ని కాల్చడానికి" అని చెబుతుంది.
⇒అనుష్క రాణి దేవసేనగా మంచిగా నటించింది.
⇒అవంతిక, శివుడు చేసే కత్తి యుద్ధం సూపర్బ్.
⇒అందాల భామను వీరవనితగా చూపించిన ఘనత రాజమౌళిది.
⇒అనుష్క, ప్రభాస్ లను స్క్రీన్ మీద ప్రత్యేక ఆకర్షణగా చూపించారు.
⇒"పచ్చబొట్టేసిన" అనే సాంగ్ చాలా అమేజింగ్ గా ఉంది. సైలెంట్ సునామీలా సాగిపోతుంది.
⇒బాహుబలి స్వర్ణ విగ్రహం ఆవిష్కరిస్తారు.
⇒అలాంటి కొన్ని సీన్లను టీజర్లలో చూశాం.
⇒అయితే స్క్రీన్ పైన చూడటం ఓ అనుభూతి.
⇒అవంతికకు సహాయం చేయాలని శివుడు నిర్ణయించుకుంటాడు.
⇒అవంతికకు శివుడు సాయమందిస్తాడు. ఆ సీన్ సూపర్‌గా తీశాడు.
⇒అపుడు ప్రభాస్.. 'దేవసేన ఎవరో నాకు తెలియదు' .. అంటాడు.
⇒అనంతరం 'నిప్పులే శ్వాసగా..' సాంగ్ వస్తుంది.
⇒భల్లాలదేవ పతనం కోసం శివుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.
⇒రాణి దేవసేన.. భల్లాలదేవ వైపు అదో కోపంగా చూస్తుంది.
⇒అక్కడ ఆ సమయంలో ఉన్న సెట్టింగులు వర్ణనాతీతం.
⇒శివుడే బాహుబలి అనే విషయం తెలుస్తుంది..
⇒⇒⇒ఇంటర్ మిషన్..
⇒తర్వాత మూవీ కోయకోన లోకి వెళ్తుంది.
⇒భల్లాలదేవ.. శివుడి కోసం వెతుకుతుంటాడు. ఇద్దరూ ఎదురెదురు పడతారు. తర్వాత ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి.
⇒రాయల్ మదర్ దేవసేన.. శివుడు.. బాహుబలిని కలుస్తుంది.
⇒అమేజింగ్ సీన్స్.. చక్కటి షాట్లు తీశారు.
⇒భద్ర.. శివుడి సీన్ మరొక సంచలనం.
⇒శివుడు.. బాహుబలి తనయుడని కరికాడ కట్టప్ప చెబుతాడు.
⇒అప్పడే మొదలవుతుంది అసలైన కథ.
⇒చిత్రం ఆమాంతం సీరియస్‌గా సాగుతుంది.
⇒నిజానికి శివుడు అంటాడు..
⇒'నేనెవరిని'
⇒డైలాగ్: నువ్వు అమరేంద్ర బాహుబలి రక్తానివి
⇒అంటూ ఎంట్రీ ఇస్తారు శివగామిగా రమ్యకృష్ణ.
⇒అమరేంద్ర బాహుబలి తనయుడే శివుడు అని చెబుతుంది.
⇒రమ్య కృష్ణ నటనతో అదరగొట్టారు.
⇒ సత్యరాజ్ (కిట్టప్ప), సుదీప్ (అస్లాం ఖాన్) మధ్య కత్తి యుద్ధంలో గెలిచిన కిట్టప్ప
⇒పోరాటయోధురాలిగా అవంతిక.. గిరిజన సైన్యానికి ఆమే నాయకురాలు
⇒భల్లాల దేవ ఖైదు నుంచి దేవసేనను విడిపించేందుకు అవంతికకు అవకాశం వస్తుంది
⇒ మాహిష్మతీ రాజ్యం.. నియంత భల్లాలదేవ ఎంట్రన్స్
⇒ భల్లాల దేవ బుల్ ఫైట్ లో ఎద్దును చంపేస్తాడు
⇒ శివుడు ఎప్పుడొస్తాడు.. తనను ఎలా విడిపిస్తాడు.. భల్లాల దేవుడిని ఎలా చంపుతాడని దేవసేన (అనుష్క) ఎదురు చూస్తుంటుంది
⇒ శివుడు, అవంతికల మధ్య వాగ్వాదం జరుగుతుంది
⇒పచ్చబొట్టేసిన పాట.. అవంతిక ఒక లక్ష్యం వేటలో తన అందాన్ని మరుగున పడేసుకుంటుంది. శివుడు ఆమెకు తన అందాన్ని మళ్లీ గుర్తించేలా చేస్తాడు.
⇒శివుడు, అవంతిక ప్రేమలో పడతారు.
⇒ మంచు తుపానులో చిక్కుకున్న శివుడు, అవంతిక.
⇒ మంచు తుపాను నుంచి శివుడు, అవంతిక తప్పించుకుంటారు. ఇప్పుడు శివుడు మాహిష్మతి రాజ్యంలోకి ప్రవేశించాడు.
⇒ దేవసేనను విడిపించడమే అతడి లక్ష్యం.
⇒ బాహుబలి బతికే ఉన్నాడని వచ్చి తనను చంపేస్తాడేమోనని భల్లాలదేవ భయపడతాడు.
⇒శివుడిని చూస్తాడు.
⇒ దేవసేనను శివుడు విడిపించుకుని తీసుకెళ్తాడు గానీ, వాళ్లను అడివి శేష్ పట్టుకుంటాడు.
⇒శివుడు, కిట్టప్పల మధ్య యుద్ధసన్నివేశం. ప్రభాస్ అడివి శేష్ ను చంపే సన్నివేశాలు అత్యద్భుతంగా ఉన్నాయి.
⇒కిట్టప్ప అప్పుడు శివుడి గతం గురించి చెబుతాడు.
⇒ ఫ్లాష్ బ్యాక్ ప్రారంభం. శివగామి మాహిష్మతి రాజ్యాన్ని ఏలుతుంటుంది.
⇒ భల్లాల దేవ, అమరేంద్ర బాహుబలిని పెంచుతున్న శివగామి
⇒ ఒక్కసారిగా స్టోరీలో ఊపు వచ్చింది.
⇒ సైనిక రహస్యాలను దొంగిలించిన సాకేత్ కోసం భల్లాలదేవ, అమరేంద్ర బాహుబలి వెతుకుతుంటారు. వాళ్లు దొంగల స్థావరంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ రాజమౌళి కామియో.
⇒ఆ తర్వాత ఐటెం సాంగ్ వస్తుంది.
⇒కొండ మీద నుంచి దూకేయడానికి సాకేత్ ప్రయత్నిస్తాడు.
⇒ ప్రభాస్ అతడిని కాపాడతాడు. కానీ భల్లాల దేవ అతడిని చంపేయాలనుకుంటాడు. అప్పుడు కట్టప్ప ప్రవేశిస్తాడు.
⇒ కాలకేయుడనే క్రూరుడైన రాజుకి ఆ సైనిక రహస్యాలను సాకేత్ అమ్మేస్తాడు.
⇒ మాహిష్మతి కాలకేయల మధ్య యుద్ధం మొదలవుతుంది. కాలకేయుడి తల నరికినవాళ్లే మాహిష్మతికి రాజు అవుతారని అమరేంద్ర బాహుబలి, భల్లాల దేవలకు చెబుతారు.
⇒ యుద్ధం మొదలైంది.
⇒ఈ యుద్ధ సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్.
⇒భీకర యుద్ధం కొనసాగుతుంటుంది.
⇒ప్రభాస్ తన సైన్యానికి ఉత్సాహం రేకెత్తిస్తుంటాడు. ఈ దృశ్యాలను వర్ణించడానికి పదాలు చాలవు.
⇒బాహుబలి, కాలకేయల మధ్య యుద్ధ సన్నివేశం.
⇒కాలకేయను సజీవంగా తీసుకురమ్మని శివగామి చెబుతుంది. కానీ భల్లాలదేవ అతడిని చంపేస్తాడు.
⇒అమరేంద్ర బాహుబలి తన ప్రజల ప్రాణాలు కాపాడతాడు కానీ భల్లాలదేవ ప్రాణాలను కాపాడడు.
⇒దాంతో బాహుబలిని రాజుగా ప్రకటిస్తారు
⇒కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు.
⇒బాహుబలి మరణంతో ముగిసిన సినిమా.