Reliance Jio SIM
-
జియోఫోన్ యూజర్లకు అదిరిపోయే కొత్త ఉచిత ఆఫర్స్!
ఎప్పటిలాగే రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.జియో ఫోన్ ప్రీ పెయిడ్ యూజర్లు కళ్లు చెదిరేలా 'బై వన్ గెట్ ఫ్రీ వన్' ఆఫర్లను ప్రకటించింది. ఉదాహరణకు జియో ఫోన్ యూజర్లు రూ.125తో రిఛార్జ్ చేసుకుంటే రూ.125 విలువ గల డేటా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో ఎయిర్టెల్ 46.13 లక్షల మంది యూజర్స్‌ను కోల్పోయింది. అదే సమయంలో రిలయన్స్ జియో 35.54 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో జియో మొత్తం యూజర్లు 43.12 కోట్లకు చేరుకున్నారు. అయితే వీరి సంఖ్యను మరింతగా పెంచేందుకు జియో ఆఫర్లను ప్రకటిస్తుంది. ఈ సారి ముఖ్యంగా గ్రామాల్ని టార్గెట్ చేస్తూ కొత్త కొత్త ఆఫర్లతో ఊరిస్తుంది. మరి ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జియో రీఛార్జ్ ప్లాన్స్ జియో ఫోన్ వినియోగదారులకు జియో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి. అందులో రూ.39,రూ.69,రూ.75,రూ.125 రూ.155,రూ.185గా ఉంది. రూ.39 రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్,14 రోజుల పాటు 100ఎంబీ డేటా అందిస్తుంది. ఆఫర్లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 100 ఎంబీ డేటాను అదనంగా పొందవచ్చు. రూ.69 రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14రోజుల పాటు ప్రతీ రోజు 0.5జీబీని పొందవచ్చు. ఆఫర్లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 1 జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. రూ.75 రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీతో 3 జీబీ డేటాను అందిస్తుంది. ఆఫర్లో భాగంగా 6జీబీ డేటాను పొందవచ్చు. రూ.125 రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 0.5జీబీని పొందవచ్చు. ఆఫర్లో భాగంగా ప్రతి రోజు 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. రూ.155 రీఛార్జ్ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్,28 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందిస్తుండగా అదనంగా రోజుకు 2జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. రూ.185 రీఛార్జ్ ప్లాన్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 2జీబీడేటాను అందిస్తుండగా ఆఫర్లో భాగంగా ప్రతి రోజు 4జీబీ డేటాను వినియోగించుకునేలా రిలయన్స్ జియో ఆఫర్లను ప్రకటించింది. -
జియో సిమ్ కావాలంటే ఇలా చేయండి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్లను ప్రకటించడంతో జియో సిమ్ కార్డుల కోసం వినియోగదారులు పోటీ పడుతున్నారు. ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. దీంతో రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ ముందు జనం బారులు తీరి కన్పిస్తున్నారు. జియో సిమ్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు కావాలి. జియో సిమ్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, మల్టీ బ్రాండ్ అవుట్లెట్లు, మొబైల్ ఫోన్ షాప్‌లలో లభిస్తాయి. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ తీసుకెళ్లాలి ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ పట్టుకెళ్లాలి ఒకవేళ ఆధార్ కార్డు తీసుకున్న రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో దరఖాస్తు చేస్తే యాక్టివేషన్ కు ఎక్కువ సమయం పడుతుంది రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తప్పనిసరి మై జియో యాప్ నుంచి ఆఫర్ కోడ్ ను తీసుకెళ్లడం మర్చిపోవద్దు జియో పోస్ట్ పెయిడ్ సిమ్ కావాలంటే ప్రస్తుతం వాడుతున్న మొబైల్ బిల్లు సమర్పించాలి అయితే పోస్ట్ పెయిడ్ బిల్లు మూడు నెలలలోపుది అయ్యుండాలి. బిల్లుపై వినియోగదారుడి అడ్రస్ స్పష్టంగా కనబడేట్టు ఉండాలి