rented flat
-
15 లక్షల అద్దె ఇంట్లో..!
‘‘పెళ్లికి ముందే కుర్రాణ్ణి ఇంటి నుంచి లాక్కొచ్చేస్తోంది... ఇక పెళ్లి తర్వాత ఏమేం చేస్తుందో’’ అని కత్రినా కైఫ్ గురించి బాలీవుడ్లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. గత కొంత కాలంగా రణ్‌బీర్ కపూర్‌తో కత్రినా ప్రేమాయణం సాగిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. ఈలోపు తాము ఉండబోతున్న స్వీట్ హోమ్ ఏర్పాట్లలో ఈ ప్రేమజంట ఉన్నారని సమాచారం. ప్రస్తుతం రణ్‌బీర్ తన తల్లితండ్రులతో కలిసి ఉంటున్నారు. ఆ ఇంటి పేరు కృష్ణరాజ్. పెళ్లయిన తర్వాత కృష్ణరాజ్లో ఉండటానికి కత్రినా పెద్దగా ఇష్టపడటంలేదట. ఇలా పెళ్లి చేసుకుని అలా వేరు కాపురం పెట్టేయాలనుకుంటున్నారని భోగట్టా. ఈ నేపథ్యంలో ముంబయ్‌లోని ఓ ప్రముఖ ఏరియాలో ఖరీదు గల ఫ్లాట్‌ని రణ్‌బీర్, కత్రినా అద్దెకి తీసుకున్నారట. ఈ ఫ్లాట్ నెల అద్దె అక్షరాలా 15 లక్షల రూపాయలని సమాచారం. తమకు నచ్చిన ఏరియాలో సొంత ఇల్లు కొనుక్కోవాలని ఈ జంట అనుకున్నారట. అయితే, ఇప్పటివరకు చూసిన ఇళ్లు అంత సంతృప్తినివ్వకపోవడంతో, ముందు అద్దె ఇంట్లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సొంతింట్లో కుడి కాలు పెట్టాలనుకుంటున్నారట. -
రణబీర్.. కత్రినా.. ఓ అద్దె ఫ్లాటు!
రణబీర్ కపూర్.. కత్రినా కైఫ్ వీళ్లిద్దరూ ప్రేమపక్షుల్లా ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నారని చాలా కాలంగా బాలీవుడ్ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పక్షులు రెండూ కలిసి ఓ గూడు కూడా చూసుకున్నాయట. ముంబై శివార్లలో తమ ప్రేమను పండించుకోడానికి ఓ మంచి అపార్టుమెంట్ వెతుక్కున్నారట. బాలీవుడ్ స్టార్లలో ఎవరెక్కడ ఉంటున్నారో గమనిస్తూ ఉండే ఔత్సాహికులు ఈ విషయాన్ని కనుగొని బయటకు తెచ్చారు. ఈ గూడుకు వాళ్లు నెలకు అక్షారలా 15 లక్షల రూపాయల అద్దె చెల్లించేందుకు అంగీకరించారట. కావాలనుకుంటే అటు రణబీర్ కపూర్ గానీ, ఇటు కత్రినా కైఫ్ గానీ సొంతంగా ఫ్లాట్ కొనాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. ఓ 15 కోట్లు పడేస్తే ఫ్లాట్ వచ్చేస్తుంది. కానీ.. అలా చేస్తే అందరికీ మరీ ఎక్కువ ప్రచారం అయిపోతుందనే వాళ్లు అద్దెకు తీసుకున్నారని చెప్పారు. కొన్ని వారాల నుంచే వీళ్లు ఫ్లాట్ అద్దెకు తీసుకున్న విషయం బయట వార్తల్లో నానుతూ వస్తోంది. అప్పుడప్పుడు సెలవులు గడిపేందుకు ఈ జంట థాయ్‌లాండ్ కూడా వెళ్లొస్తూ ఉంటుంది. బహుశా ఫిబ్రవరిలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవచ్చని కూడా అంటున్నారు.