15 లక్షల అద్దె ఇంట్లో..! | Ranbir Kapoor, Katrina Kaif to pay Rs. 15 lakh as rent? | Sakshi
Sakshi News home page

15 లక్షల అద్దె ఇంట్లో..!

Published Thu, Nov 13 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

15 లక్షల అద్దె ఇంట్లో..!

15 లక్షల అద్దె ఇంట్లో..!

‘‘పెళ్లికి ముందే కుర్రాణ్ణి ఇంటి నుంచి లాక్కొచ్చేస్తోంది... ఇక పెళ్లి తర్వాత ఏమేం చేస్తుందో’’ అని కత్రినా కైఫ్ గురించి బాలీవుడ్‌లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. గత కొంత కాలంగా రణ్‌బీర్ కపూర్‌తో కత్రినా ప్రేమాయణం సాగిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. ఈలోపు తాము ఉండబోతున్న స్వీట్ హోమ్ ఏర్పాట్లలో ఈ ప్రేమజంట ఉన్నారని సమాచారం. ప్రస్తుతం రణ్‌బీర్ తన తల్లితండ్రులతో కలిసి ఉంటున్నారు.

ఆ ఇంటి పేరు కృష్ణరాజ్. పెళ్లయిన తర్వాత కృష్ణరాజ్‌లో ఉండటానికి కత్రినా పెద్దగా ఇష్టపడటంలేదట. ఇలా పెళ్లి చేసుకుని అలా వేరు కాపురం పెట్టేయాలనుకుంటున్నారని భోగట్టా. ఈ నేపథ్యంలో ముంబయ్‌లోని ఓ ప్రముఖ ఏరియాలో ఖరీదు గల ఫ్లాట్‌ని రణ్‌బీర్, కత్రినా అద్దెకి తీసుకున్నారట. ఈ ఫ్లాట్ నెల అద్దె అక్షరాలా 15 లక్షల రూపాయలని సమాచారం. తమకు నచ్చిన ఏరియాలో సొంత ఇల్లు కొనుక్కోవాలని ఈ జంట అనుకున్నారట. అయితే, ఇప్పటివరకు చూసిన ఇళ్లు అంత సంతృప్తినివ్వకపోవడంతో, ముందు అద్దె ఇంట్లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సొంతింట్లో కుడి కాలు పెట్టాలనుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement