Renuka ellamma Temple
-
బోనమెత్తి..మొక్కులు చెల్లించి
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ శివారులో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో గవర్నర్ తమిళిసై బోనమెత్తి మొక్కులు సమర్పించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నేత నందీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం గవర్నర్‌కు ఇక్కడికి వచ్చారు. ముందుగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన బంగారు ఆభరణాలను గవర్నర్ అలంకరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు. ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడుకోవాలి: దత్తాత్రేయ ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
ఉద్రిక్తంగా మారిన ప్రహరీ గోడ నిర్మాణం
జూబ్లి బస్టాండ్ సమీపంలో ఉన్న పికెట్ గాంధీనగర్ లోమంగళవారం తెలంగాణ ఆర్టీసి అధికారులు ఖాళీ స్థలం చుట్టూ ప్రహారిగోడ నిర్మాణాన్ని చేపట్టారు. రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రహారిగోడ నిర్మించవద్దంటు గాంధీనగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసి అధికారులు చేపట్టిన ప్రహారిగోడ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో బారిగా పోలీసులు మోహరించారు. ఆలయం చుట్టూ గోడ నిర్మాణ ం చేపడితే ఆత్మహత్యకు పాల్పడుతాం అంటు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఆర్టీసి అధికారులు గత నెల పికెట్ గాంధీ కాలనీ లో ఉన్న సుమారు 300 గుడిసెలను తొలగించి స్థలాన్ని స్వాదిన పరుచుకున్నారు. చుట్టూ ప్రహారిగోడ నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన జేఎన్‌ఎన్‌యుఆర్‌యం లో వందల మంది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. స్థానికంగా ఉన్న ఎల్లమ్మ ఆలయం లో పూజలు నిర్వహిస్తుంటారు.ఆలయం ఆర్టీసి స్థలంలో ఉండటంతో అధికారులు చుట్టూ గోడ నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. కాలనీ వాసులుకు అండగా ఎమ్మేల్యే సాయన్న అమ్మవారి ఆలయం వద్ద నిర్మిస్తున్న ప్రహారిగోడ విషయాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యేసాయన్న దష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే పికెట్ గాందీ కాలనీ కి చేరుకున్న సాయన్న ఆర్టీసి అధికారులుకు సర్ధిచెప్పారు.అయితే అధికారులు స్పందించక పోవడంతో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడి ప్రహారిగోడ పనులను నిలిపి వేయాలని కోరారు. మంత్రి గారి ఆదేశాలతో అర్టీసి ఆధికారులు వెనుదిగారు. కాలనీ వాసులకు అలయం చుట్టు కొంత స్థలాన్ని కేటాయిచనున్నట్లు సాయన్న కాలనీ వాసులకు హామి ఇచ్చారు.దీంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు.