
పటాన్‌చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణ శివారులో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో గవర్నర్ తమిళిసై బోనమెత్తి మొక్కులు సమర్పించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నేత నందీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం గవర్నర్‌కు ఇక్కడికి వచ్చారు.
ముందుగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన బంగారు ఆభరణాలను గవర్నర్ అలంకరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు.
ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడుకోవాలి: దత్తాత్రేయ
ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు.