Research field
-
లోపలికి తొంగిచూడొచ్చు
1897లో వచ్చిన హెచ్‌జీ వేల్స్ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ నవల ‘ద ఇన్విజిబుల్ మ్యాన్’ గుర్తుందా? ఒంట్లో కణాలన్నింటినీ పారదర్శకంగా మార్చేసే ద్రావకాన్ని హీరో కనిపెడతాడు. దాని సాయంతో ఎవరికీ కని్పంచకుండా ఎంచక్కా మాయమైపోతాడు. దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా సైంటిస్టులు అలాంటి ఆవిష్కరణే చేశారు! అది కూడా సాదాసీదా ఫుడ్ కలరింగ్ ఏజెంట్ సాయంతో!! దాని సాయంతో తయారు చేసిన సరికొత్త ‘ద్రావకం’ చర్మాన్ని పారదర్శకంగా మార్చేస్తోంది. దాంతో ఒంట్లోని అవయవాలన్నింటినీ మామూలు కంటితోనే భేషుగ్గా చూడటం వీలుపడింది. దీన్నిప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగం మనుషులపైనా విజయవంతమైతే బయో జీవ రసాయన, వైద్య పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని భావిస్తున్నారు... ఇలా సాధించారు... టార్ట్రాజైన్ అనే మామూలు పసుపు రంగు ఫుడ్ కలరింగ్ ఏజెంట్‌ను నీళ్లలో కలపడం ద్వారా చర్మాన్ని మాయం చేసే ద్రావకాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఈ మేజిక్‌ను సాధించేందుకు ఆప్టిక్ రంగ పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. పసుపు రంగు కలరింగ్ ఏజెంట్‌లోని అణువులు మామూలుగానైతే కాంతిని విపరీతంగా శోషించుకుంటాయి. ముఖ్యంగా నీలి, అతినీల లోహిత కాంతిని తమగుండా వెళ్లనీయవు. కానీ దాన్ని నీటితో కలిపిన మీదట వచ్చే ద్రావకం పూర్తిగా పారదర్శక ధర్మాలను కలిగి ఉంటుంది. దాన్ని చర్మంపై రుద్దితే దాని కణజాలాలకు కాంతి పరావర్తక సామర్థ్యం లోపిస్తుంది. దాంతో ద్రావకం లోపలికి ఇంకుతూనే చర్మం కని్పంచకుండా పోతుంది! మరోలా చెప్పాలంటే ‘మాయమవుతుంది’. ఈ ద్రావకాన్ని తొలుత కోడి మాంసంపై రుద్దారు. ఫలితం సంతృప్తికరంగా అని్పంచాక ప్రయోగాత్మకంగా ఒక ఎలుకపై పరీక్షించి చూశారు. దాని తల, పొట్టపై ఉన్న చర్మం మీద ద్రావకాన్ని పూశారు. దాంతో ఆయా భాగాల్లో చర్మం తాత్కాలికంగా పారదర్శకంగా మారిపోయింది. ఫలితంగా తల, పొట్ట లోపలి అవయవాలు స్పష్టంగా కని్పంచాయి. ద్రావకాన్ని కడిగేసిన మీదట చర్మం ఎప్పట్లాగే కన్పించింది. పైగా ఈ ప్రక్రియలో ఎలుకకు ఎలాంటి హానీ కలగలేదు. రక్తనాళాలన్నీ కన్పించాయి ఎలుకల తలపై ద్రావకం రుద్దిన మీదట మెదడు ఉపరితలం మీది రక్తనాళాలు మామూలు కంటికే స్పష్టంగా కని్పంచాయి. అలాగే పొట్ట భాగంలోని అవయవాలు కూడా. ‘‘మౌలిక భౌతిక శాస్త్ర నియమాలు తెలిసినవారికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ ఇతరులకు మాత్రం అచ్చం అద్భుతంగానే తోస్తుంది’’ అని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జిహావో యూ అన్నారు. ‘‘పొట్టపై ఈ ద్రావకాన్ని రుద్దితే చాలు. పొద్దుటినుంచీ ఏమేం తిన్నదీ స్పష్టంగా కని్పస్తుంది. చూడటానికి చాలా సింపులే గానీ, ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్’’ అని వివరించారు. అయితే దీన్నింకా మనుషులపై ప్రయోగించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.లాభాలెన్నో... మనుషులపై గనక ఈ ప్రక్రియ విజయవంతమైతే వైద్యపరంగా ఎనలేని లాభాలుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. → రక్తం శాంపిళ్ల సేకరణ, రోగి ఒంట్లోకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఎక్కించడం వంటివి మరింత సులభతరం అవుతాయి. ముఖ్యంగా రక్తనాళాలు దొరకడం కష్టంగా మారే వృద్ధులకు ఇది వరప్రసాదమే కాగలదు.→ చర్మ క్యాన్సర్ వంటివాటిని తొలి దశలోనే గుర్తించడం సులువవుతుంది. → ఫొటోడైనమిక్, ఫొటోథర్మల్ థెరపీల వంటి కణజాల చికిత్సల్లోనూ ఇది దోహదకారిగా మారుతుంది. → లేజర్ ఆధారిత టాటూల నిర్మూలన మరింత సులువవుతుంది.కొన్నిపద్ధతులున్నాకణజాలాలను పారదర్శకంగా మార్చేందుకు ప్రస్తుతం పలు ద్రావకాలు అందుబాటులో ఉన్నా అవి ఇంత ప్రభావవంతమైనవి కావు. పైగా పలు డీహైడ్రేషన్, వాపులతో పాటు కణజాల నిర్మాణంలోనే మార్పుల వంటి సైడ్ ఎఫెక్టులకు దారి తీస్తాయి. టార్ట్రాజైన్ ద్రావకంతో ఈ సమస్యలేవీ తలెత్తలేదు. అయితే టార్ట్రాజైన్ మనుషులకు హానికరమంటూ తినుబండారాల్లో దీని వాడకాన్ని అమెరికాలో పలువురు కోర్టుల్లో సవాలు చేశారు. దీన్ని చిప్స్, ఐస్‌క్రీముల్లో వాడతారు.కొసమెరుపు: ఇన్విజిబుల్ మ్యాన్ నవల్లో మాదిరిగా మనిíÙని పూర్తిగా మాయం చేయడం ఇప్పుడప్పట్లో సాధ్యపడేలా లేదు. ఎందుకంటే టార్ట్రాజైన్ ద్రావకం ఎముకలను పారదర్శకంగా మార్చలేదట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పరిశోధనల్లోనూ అగ్రగామి కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫార్మసీ రాజధానిగా ఎదిగిన భారత్.. శాస్త్ర పరిశోధనల రంగంలోనూ అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగేందుకు కృషి చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ జనాభా తీసుకునే ప్రతి ఆరు మాత్రల్లో ఒకటి భారత్‌లో తయారవుతోందని.. అగ్రరాజ్యం అమెరికా విషయానికి వస్తే ప్రతి నాలుగు మాత్రల్లో ఒకటి ఇక్కడ తయారైన జెనరిక్ మాత్ర అని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్ శివారులోని జినోమ్ వ్యాలీలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ‘‘నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్’’ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన రంగంలో అగ్రగామిగా మారేందుకు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల పరిశోధనశాలల్లో ప్రైవేట్ రంగం కూడా పరిశోధనలు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో అవసరాన్ని బట్టి ప్రైవేట్ సంస్థల్లోని సౌకర్యాలను వాడుకునేందుకు ప్రభుత్వ సంస్థలకూ అవకాశం ఉండేలా చూస్తామని చెప్పారు. పరిశోధనలకు పెద్ద ఎత్తున వేర్వేరు జాతుల జంతువులు అవసరమవుతాయని, నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ ఈ అవసరాన్ని తీరుస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. ఇది దేశంలోనే అతిపెద్ద వ్యవస్థ అని, ఎలుకలు మొదలుకొని గుర్రాల వరకూ పలు రకాల జంతువులను పెంచి పోషించేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ పరిశోధనలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారని అన్నారు. ఇందుకు తగ్గట్టుగా కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పూర్తిస్థాయి స్వదేశీ టీకా తయారైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశంలోని అన్ని ఎయిమ్స్ ఆసుపత్రుల్లో సమీకృత వైద్యవిధానం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆయుర్వేదంతోపాటు అన్ని రకాల వైద్యపద్ధతుల్లో మెరుగైన వైద్యం అందించడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ భాల్ పాల్గొన్నారు. ఎన్ఐఎన్కు మంత్రి మాండవీయ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)ను సందర్శించారు. సంస్థలోని వివిధ విభాగాల్లో జరుగుతున్న పరిశోధనల గురించి అక్కడి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘డైట్ అండ్ బయోమార్కర్ స్టడీ’ని ప్రారంభించారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ వర్గాల ఆహారపు అలవాట్ల నమోదు, దేశవ్యాప్తంగా ఆహారం, పోషకాల కొరతను గుర్తించడం ఈ అధ్యయనం ముఖ్యఉద్దేశం. ఈ అధ్యయనం ద్వా రా రక్తహీనత సహా పలు పోషక లోపాల సమాచారం తెలుస్తుందని ఎన్ఐఎన్ డైరెక్టర్ ఆర్.హేమలత తెలిపారు.దేశంలో తొలి సా రి వివిధ ప్రాంతాల్లో వండిన ఆహారం, వండని ఆహారంలో ఉండే పోషకాలను గుర్తించేందుకు ఈ అధ్యయనం ద్వారా ప్రయత్నం చేస్తున్నామని హేమలత వివరించారు. -
నడపబోయేది నారీమణులే
శాస్త్ర పరిశోధన రంగంలో మహిళలు రాణించలేరన్నది ఒకప్పటి పితృస్వామ్య సమాజంలో ఉన్న అభిప్రాయం. ఆ సమాజంలో కూడా అది మగవాళ్ల అభిప్రాయమే తప్ప సమాజమంతటి అభిప్రాయం కాదు. సమాజంలో సగభాగమైన మహిళల అభిప్రాయం ఎంత మాత్రమూ కాదు. దీనికి ‘అభిప్రాయం’ అనే మాట వాడడం కూడా తప్పే! ఇది కేవలం వారి అపోహ మాత్రమే అంటున్నారు నేటి మహిళలు. కావాలంటే ఒకసారి మా మహిళల విజయాలను సింహావలోకనం చేసుకోండి అని సవాల్ విసురుతున్నారు. ‘విమెన్ కాంట్ డూ సైన్స్’ అనే అపోహను తుడిచి పాతరేస్తూ ‘విమెన్ ఇన్ సైన్స్’ అని నినదిస్తున్నారు. నిదర్శనంగా ఓ ఎనిమిది మహిళా సైంటిస్టులను ఉదహరిస్తున్నారు. డాక్టర్ గగన్ దీప్ కాంగ్ (57) రాయల్ సొసైటీ ఫెలోషిప్ అందుకున్న తొలి భారతీయ మహిళ. బయాలజీని ఇష్టపడే గగన్ దీప్.. తమిళనాడు, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత పబ్లిక్ హెల్త్ రంగంలో పరిశోధనల మీద దృష్టి కేంద్రీకరించారు. అనంతరం క్లినికల్ రీసెర్చర్‌గా స్థిరపడ్డారు. చిన్న పిల్లల్లో డయేరియాను నివారించడానికి దోహదం చేసే రోటావైరస్ వ్యాక్సిన్ ఆమె ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఆమె ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. రోహిణీ గాడ్బోలే (67) ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి)లోని హై ఎనర్జీ ఫిజిక్స్ విభాగంలో ఫిజిసిస్ట్. గత ముప్పై ఏళ్లుగా భౌతికశాస్త్రంలో పరిశోధనలు చేస్తున్నారు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో పార్టికల్ ఫిజిక్స్‌లో డాక్టరేట్ తీసుకుని 1979లో ఇండియాకు తిరిగి వచ్చారు. స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పర్టికల్ ఫిజిక్స్‌లో 150కి పైగా పత్రాలను ప్రచురించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (ఎన్ఎఎస్ఐ) ఫెలోషిప్ తో పాటు.., అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ద డెవలపింగ్ వరల్డ్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీల్లో కూడా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. రోహిణి తన పరిశోధనలకే పరిమితం కాలేదు. మనదేశంలో శాస్త్ర పరిశోధన రంగంలో సేవలందించిన మహిళలందరి జీవిత విశేషాలతో ‘లీలావతీస్ డాటర్స్’ పేరుతో పుస్తకాన్ని తెచ్చారు. సునీత సారవాగి (50) ముంబయిలోని ఐఐటీ– బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి హెడ్డు. గత రెండు దశాబ్దాలుగా డాటా మైనింగ్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో పరిశోధనలు చేస్తున్నారు. ఒడిషాలోని బాలాసోర్‌కు చెందిన సునీత పంతొమ్మిది వందల ఎనభైలలో ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో అండర్ గ్రాడ్యుయేషన్‌లో చేరినప్పుడు ఆ కోర్సులో చేరిన వాళ్లలో అమ్మాయి ఆమె ఒక్కరే. ఆ తర్వాత ఆమె యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పీహెచ్డీ చేసి కాలిఫోర్నియాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్‌లో సైంటిస్ట్‌గా పరిశోధనలు చేశారు. అదితి సేన్ దే (45) 2018లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారు. భౌతిక శాస్ట్రంలో ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ ఆమె. అలహాబాద్‌లోని హరీష్ చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్. మాథమేటిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అదితి క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో పరిశోధనలకు గాను ఆమె బహుమతినందుకున్నారు. కాళికా బాలి (48) ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో కృత్రిమ మేధ అంశంలో, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ టెక్నాలజీలో పరిశోధనలు చేస్తున్నారు. బాలి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి ఫొనెటిక్స్‌లో పీహెచ్డీ చేశారు. ఇదే అంశంలో ఆమె సెమినార్లలో పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈ పరిశోధనలతోపాటు కాళికా బాలి ఆదివాసీల భాషల మీద కూడా పరిశోధనలు చేస్తూ, ఆయా భాషలకు హిందీ భాషకు మధ్య ఉన్న సమైక్యతాంశాలను కూడా అధ్యయనం చేస్తున్నారు. దేవప్రియ చటోపాధ్యాయ (39) కోల్‌కతాలోని ఐఐఎస్ఈఆర్లో ఎర్త్ అండ్ క్లైమేజ్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్. ప్రాచీన కాలం నాటి జీవావరణ సమతుల్యత, ప్రస్తుత ఆధునిక కాలంలో జీవవైవిధ్యత సమతుల్యతలో ఎదురవుతున్న సంక్లిష్టతల మీద ఆమె పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకోసం ఆమె గుజరాత్ రాష్ట్రం, కచ్ ప్రాంతంలోని శిలాజాల సేకరణ అధ్యయనం మీద, మంచు శిఖరాలు కరిగి సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతాల్లోని మానవాళికి ఎదురయ్యే సమస్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. విదిత వైద్య, న్యూరో సైంటిస్ట్ (49) ఆమె ముంబయిలోని సెయింట్ జేవియర్ కాలేజ్, అమెరికాలోని యేల్ యూనివర్సిటీలోనూ చదివారు. ఆక్స్‌ఫర్డ్‌లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. విదిత తల్లి కూడా ఎండోక్రైనాలజీలో పరిశోధనలు చేశారు. విదిత మాలిక్యులార్ సైకియాట్రీలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. మనిషిలోని భావోద్వేగాలు, మానసిక ఆరోగ్యం, డిప్రెషన్, యాంగ్జయిటీలు మానవ సంబంధాల మీద చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేశారామె. విదిత ప్రస్తుతం ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో బోధన రంగంలో ఉన్నారు. విదిత 2015లో మెడికల్ సైన్సెస్ విభాగంలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారు. నందిని హరినాథ్ (45) ఇస్రోలో రాకెట్ సైంటిస్ట్. రెండు దశాబ్దాల ఉద్యోగ జీవితంలో ఆమె 14 స్పేస్ మిషన్స్ ప్రయోగాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. మార్స్ ఆర్బిటర్ మిషన్– మంగళ్యాన్ విజయాన్ని నడిపించిన మేధోబృందంలో కూడా డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్. ఈ ఏడాది నాసా– ఇస్రో సంయుక్తంగా నిర్వహించనున్న శాటిలైట్ వెంచర్ నిసార్ (ఎన్ఐఎస్ఏఆర్) ఆమె ఆధ్వర్యంలోనే జరగనుంది. – మంజీర ►జాతి నిర్మాణంలో, దేశాన్ని శాస్త్రీయంగా ముందుకు నడిపించడంలో మహిళలు పెద్ద భూమికనే పోషించబోతున్నారని నీతి అయోగ్ తాజా నివేదిక అంచనా వేసింది. ‘సైన్స్ రంగంలో పట్టభద్రులవుతున్న వారిలో మూడవ వంతు మహిళలే. భారతీయ పరిశోధన సంస్థలు, యూనివర్సిటీలలో పరిశోధన, బోధనలలో కీలకమైన స్థానాలలో మున్ముంది మహిళల శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది. -
పరిశోధనలకు పెద్దపీట
సాక్షి, సిటీబ్యూరో: పరిశోధనా రంగాన్ని మరింత బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తోందని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్వీపీఇఐ)లో కొత్తగా ఏర్పాటు చేసిన “ది సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్’ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో పరిశోధన శాల ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. దీనికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ప్రపంచంలోనే ఈ ఆస్పత్రి కార్నియా మార్పిడి శస్త్రచికిత్సల్లో ఐదో స్థానంలో ఉండటం మనకు గర్వ కారణమన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ జీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సృజన ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. ఎల్వీప్రసాద్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్‌రావు మాట్లాడుతూ 2030 నాటికి అంధత్వం లేని తెలంగాణను తీర్చి దిద్దడమే లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో సృజన ఇ న్నోవేషన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వీరేందర్ సాంగ్వాన్ పాల్గొన్నారు.