The researchers
-
గరిష్ట ఆయువు 125 ఏళ్లు!
వాషింగ్టన్: మానవుడు 125 ఏళ్లకు మించి ఎక్కువ కాలం జీవించడం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక ఎవరికీ సాధ్యం కాదని తాజా పరిశోధనలో తేలింది. 19వ శతాబ్దం నుంచి ఈ వయసు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిందని, ప్రజారోగ్యం, ఆహారం, వాతావరణ పరిస్థితుల వల్ల ఇది సాధ్యమైందని పరిశోధకులు స్పష్టం చేశారు. క్రమేణా పెరుగుతున్న ఆ గ్రాఫ్ ఇంతటితో ఆగిపోతుందని అమెరికాలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు తేల్చిచెప్పారు. ఈ గ్రాఫ్ ఆగిపోవడం 1990ల్లోనే జరిగిందని వారి పరిశోధనల్లో తేలినట్లు ప్రొఫెసర్ జాన్ విజ్ పేర్కొన్నారు. దాదాపు 40 దేశాలకు చెందిన జనన మరణాల రేటును అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. -
కూర్చొని పనిచేస్తే..జీవితకాలం కరిగిపోతుంది
వాషింగ్టన్: గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేయడం అలవాటైనవారికి నిజంగానే ఇది చేదువార్త. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏటా మరణిస్తున్న వారిలో నాలుగు శాతం మంది వరుసగా మూడు, నాలుగు గంటలు ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నవారేనని తాజా అధ్యయనంలో తేలింది. 2002 నుంచి 2011 వరకు 54 దేశాల్లో నమోదైన మరాణాలను శాన్ జార్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు విశ్లేషించారు. దీని ప్రకారం రోజులో మూడు గంటల కంటే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పనిచేసే వారిలో 2002-11 వరకు ప్రతి ఏడాది 4.33 లక్షల మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 60 శాతం మంది ప్రజలు మూడు గంటల కంటే ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారని, ఇక యుక్తవయసులో ఉన్నవారు సుమారు 5 గంటలసేపు కూర్చొనే ఉంటున్నారని బ్రెజిల్‌లోని సావో పాలో వర్సిటీకి చెందిన లియాండ్రో రెజెండే ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆన్లైన్ గేమ్స్ అంత ప్రమాదమేమీ కాదట!
పరిపరి శోధన పిల్లలు వీడియో గేమ్స్ ఆడటం వల్ల వారి చదువు చంకనాకిపోతుందని, తెలివితేటలు తెల్లారిపోతాయని, మెదడు మందకొడిగా తయారవుతుందని పరిశోధకులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అయితే రోజూ ఆన్లైన్ గేమ్స్ ఆడే పిల్లల బుర్ర చురుగ్గా తయారవుతుందని, చదువుల్లో ముందుంటారని తాజాపరిశోధనలు చెబుతున్నాయి. నిత్యం ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడే పిల్లలు, మ్యాథ్స్‌లో, సైన్స్‌లో మిగిలిన వారి కన్నా ఎక్కువ మార్కులు సాధించినట్లు వెల్లడైంది. ఈ పరిశోధనలు నిర్వహించిన మెల్బోర్న్లోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆల్బెర్టో పోసో అనే విద్యావేత్త మాటల్లో చెప్పాలంటే... ఆన్లైన్ గేమ్స్ ఆడే పిడుగులలో ఏకాగ్రత పెరుగుతుంది. గేమ్‌లో తర్వాతి స్టెప్‌ను ఎలా అందుకోవాలా అన్న ఆలోచనతో బుర్రకు పదును పెట్టుకోవడం వల్ల వారిలో జీకే పెరుగుతుంది, లెక్కల్లో, సైన్స్‌లో పరిణతి పెరుగుతుంది. ఫలితంగా చదువులో చురుగ్గా ఉంటారని దాదాపు 700కు పైగా హైస్కూల్ స్టూడెంట్స్‌ను అధ్యయనం చేసిన ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ (పిసా) చెబుతోంది. ఆన్లైన్ గేమ్స్ ఆడేవారు ఆ గేమ్‌కు సంబంధించిన నియమనిబంధనలను ఆకళింపు చేసుకోవడం కోసం పేజీలకొద్దీ సమాచారాన్ని చదవడం వల్ల లెక్కలు, సైన్స్‌లో ముందుండగలుగుతారు. అయితే వీడియోగేమ్స్ వేరు, ఇంటర్నెట్ వేరు. పొద్దస్తమానం ఇంటర్నెట్లో గంటలకొద్దీ గడపకూడదు. అలాగే సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విటర్ వంటివాటితో తలమునకలుగా ఉండేవారు మాత్రం చదువులో వెనకపట్టులో ఉంటారట. -
ఇప్పటికింకా నా వయసు నూట పదహారు సంవత్సరాలే!
సమ్‌థింగ్ స్పెషల్ ఫిలోమేన వయసు ఇప్పుడు నూట పదహారు సంవత్సరాలు. ‘‘మీ దీర్ఘాయుష్షు వెనుక రహస్యం?’’ ‘‘ఈ వయసులోనూ మీరు ఇంత చురుకుగా ఎలా ఉండగలుగుతున్నారు?’’ బాపతు ప్రశ్నలకు ఆమె చెప్పే సరదా సమాధానం- ‘‘నాకు రెండు వయసులు ఉన్నాయి. ఒకటి శారీరక వయసు. రెండు మానసిక వయసు. నా మానసిక వయసు పదహారు సంవత్సరాలే’’ పెరూలోని అండెస్ గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన ఫిలోమేన తన ఆరోగ్యానికి సంబంధించి పని గట్టుకొని చేసే ప్రత్యేక వ్యాయమాలు ఏమీలేవు. మేక పాలు ఇష్టంగా తాగుతుంది. మేక మాంసాన్ని, బంగాళదుంపలను మరింత ఇష్టంగా తింటుంది. ఇప్పటి వరకు తన చిన్ని గ్రామాన్ని ఎన్నడూ విడిచి వెళ్లలేదు. పోషక విలువలు ఉన్న ఆహారాన్ని భుజించడమే తన దీర్ఘాయుష్షు వెనకగల రహస్యం అని చెబుతుంది ఫిలోమేన. ఆమె ఏ కారణం చెబుతున్నప్పటికీ... ఫిలోమేన దీర్ఘాయుష్షు రహస్యం కనుక్కోవడానికి కొందరు పరిశోధకులు ఇప్పుడు రంగంలోకి దిగారు. -
తెలివైన మగాడిని ఎలా గుర్తు పట్టాలంటే....
ఆసక్తికరం ఒక మగాడిని చూసీచూడగానే- ‘‘ఈయన తెలివైన వాడు’’ ‘‘ఈయన తెలివితక్కువవాడు’’ అని చెప్పగలమా? ‘‘అబ్బే..అదెలా సాధ్యం?’’ అంటాం. ‘‘ఖచ్చితంగా సాధ్యమే’’ అంటున్నారు చెక్ రిపబ్లిక్కు చెందిన పరిశోధకులు. 40 మంది పురుషులు, 40 మంది స్త్రీల ముఖారవిందాల ఫోటోలు తీసుకొని తెలివి తేటలు, ప్రవర్తనతో సహా రకరకాల విషయాలను అధ్యయనం చేశారు. ‘‘కేవలం ముఖకవళికల ఆధారంగానే ఒక అంచనాకు రాలేదు. అనేక అంశాలను కాచి వడబోసి ఒక నిర్ణయానికి వచ్చాం’’ అంటున్నారు పరిశోధకులు. వాళ్లు చెప్పిన విషయాల్లో మచ్చుకు కొన్ని పొడవైన ముక్కు, రెండు కళ్ల మధ్య బాగా దూరం ఉన్నవాళ్లకు ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి. గుండ్రటి చుబుకం ఉన్నవాళ్లలో తెలివివైనవాళ్లు ఎక్కువగా ఉంటారు. గుండ్రటి ముఖం, ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్న కళ్లు ఉన్నవాళ్లకు తక్కువ తెలివితేటలు ఉంటాయట!