
గరిష్ట ఆయువు 125 ఏళ్లు!
వాషింగ్టన్: మానవుడు 125 ఏళ్లకు మించి ఎక్కువ కాలం జీవించడం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక ఎవరికీ సాధ్యం కాదని తాజా పరిశోధనలో తేలింది. 19వ శతాబ్దం నుంచి ఈ వయసు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిందని, ప్రజారోగ్యం, ఆహారం, వాతావరణ పరిస్థితుల వల్ల ఇది సాధ్యమైందని పరిశోధకులు స్పష్టం చేశారు.
క్రమేణా పెరుగుతున్న ఆ గ్రాఫ్ ఇంతటితో ఆగిపోతుందని అమెరికాలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు తేల్చిచెప్పారు. ఈ గ్రాఫ్ ఆగిపోవడం 1990ల్లోనే జరిగిందని వారి పరిశోధనల్లో తేలినట్లు ప్రొఫెసర్ జాన్ విజ్ పేర్కొన్నారు. దాదాపు 40 దేశాలకు చెందిన జనన మరణాల రేటును అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.