reservoiers
-
నిండు కుండల్లా మారిన జలశయాలు
-
ఎత్తిపోతలు మొదలైనా చేరని పుష్కర జలాలు
సాక్షి, తుని(తూర్పు గోదావరి): ఖరీఫ్‌లో సకాలంలో వరినాట్లు వేద్దామని భావించిన రైతులకు నిరాశే మిగులుతోంది. ఈ నెల మొదట వారంలో వేసిస నారుమళ్లు సాగునీటి ఎద్దడితో ఎండిపోతున్నాయి. ఇప్పటికే చెరువులు, రిజర్వాయర్లలో చుక్కనీరులేక వెలవెలబోతున్నాయి. ఈ నెల పదో తేదీన పురుషోత్తంపట్నం వద్ద పుష్కర ఎత్తిపోతలు పథకాన్ని ప్రారంభించినా మెట్టప్రాంతానికి గోదావరి జిలాలు చేరనేలేదు. వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్ నాట్లు సాధ్యమవుతాయని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వివిధ దేవాలయాల్లో వేదపండితులు, అర్చకులు వర్షాలు కురవాలంటూ వరుణ జపాలు, విరాటపర్వం పారాయణాలు చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తేనే ఈ సంవత్సరం ఖరీఫ్ గట్టెక్కుతుందని రైతులు అంటున్నారు. నియోజకవర్గంలో 29 వేల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉంది. ఇందుకు పంపా, తాండవ రిజర్వాయర్లతో పాటు పుష్కర ఎత్తిపోతలు, పిఠాపురం బ్రాంచి కెనాల్, చెరువులు, విద్యుత్ బోరుబావులతో పాటు వర్షాధారం సాగునీరు అందాల్సి ఉంది. ఏటా మెట్ట ప్రాంతంలో రైతులు జూన్‌లో తొలకరి వర్షాలకు నారుమళ్లు, జూలైలో వర్షాలకు వరినాట్లు వేస్తున్నారు. అందుకు భిన్నంగా ఈ సంవత్సరం వర్షాలు పూర్తి స్థాయిలో కువలేదు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు ఆరుతడి పంటలతో పాటు రైతులు వరినార్లు వేశారు. డెడ్ స్టోరేజీల్లో రిజర్వాయర్లు నియోజకవర్గంలో తొండంగి మండలానికి పంపా రిజర్వాయర్, కోటనందూరు మండలానికి తాండవ రిజర్వాయర్లు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తుని మండలంలో కొంత భాగానికి పుష్కర జలాలు, మరికొంత భాగానికి తాండవ జలాలు, మిగిలిన భూములను చెరువులు, విద్యుత్ బోర్ల ఆధారంగా సాగుచేస్తున్నారు. తొండంగి మండలంలో 13500 ఎకరాలకు సాగునీరు అందించే పంపా రిజర్వాయర్ నుంచి విడుదల చేసేందుకు చుక్కనీరు అందుబాటులో లేదు. 105 అడుగుల నీటి నిల్వ సామార్థ్యం గల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అడుగంటాయి. భారీ వర్షాలు, పుష్కర జలాలు చేరితేనే పంపాకు జల కళ వస్తుంది. అప్పుడు ఆయకట్టుకు సాగునీరు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కోటనందూరు మండలంలో తొమ్మిది వేల ఎకరాలకు తాండవ రిజర్వాయర్ నుంచి సాగునీరు చేరాల్సి ఉంది. 380 అడుగుల నీటి నిల్వ సామార్థ్యం గల రిజర్వాయర్‌లో 345 అడుగుల నీరు ఉంది. డెడ్ స్టోరేజీ 340 కంటే ఐదు అడుగులు నీరుంది. దిగువకు విడుదల చేసేందుకు అవసరమైన నీటి నిల్వలు లేవు. వర్షాధారంగానే తాండవ జలాశయంలోకి నీటి నిల్వలు చేరాల్సి ఉంది. భారీ వర్షాలు కురిస్తేనే తాండవకు జల కళ వస్తుంది. ఆ నీటినే దిగువకు విడుదల చేయాల్సి ఉంది. తుని మండలంలో సాగునీటి పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. పుష్కర కాలువ ద్వారా 6500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా గత ఐదేళ్లలో రెండు వేల ఎకరాలకే నీరు ఇస్తున్నారు. తాండవ నుంచి డి.పోలవరం చెరువుకు నీరు చేరడం ద్వారా ఆయకట్టుకు నీరు అందుతుంది. ఇప్పుడా పరిస్థితులు సన్నగిల్లాయి. తాండవలో చుక్కనీరు లేకపోవడం, వర్షాలు కురవకపోవడంతో సాగునీటి జాడ కనిపించడంలేదు. మండలంలో 77 చెరువులు ఉన్నా 70 చెరువులు ఎండిపోయాయి. ఎటుచూసినా నీటి అవసరాలు తీరే మార్గం కనిపించడంలేదని రైతులు వాపోతున్నారు. అన్నిటికి ఒక్కటే పరిష్కారంగా భారీ వర్షాలు కురవాలని రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వరుణుడు కరుణిస్తేనే.. సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నా వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్ సాగు చేయగలం. పుష్కర ఎత్తిపోతల నుంచి నీరు విడుదలైనా పూర్తి స్థాయిలో పంట పొలాలకు చేరదు. వర్షాలు కురిస్తే కొంత మేరకు రైతులందరికీ సాగునీరు లభిస్తుంది. భారీ వర్షాలు కురిస్తేనే పుష్కర, తాండవ, పంపా రిజర్వాయర్లకు జలకళ వస్తుంది. – పి.మాణిక్యాలరావు, రైతు, టి.తిమ్మాపురం వారంలో పుష్కర జలాలు ఈ నెల పదో తేదీన పుష్కర ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల్లో 50 కిలో మీటర్ల వరకూ కాలువకు నీరు వచ్చింది. వారం రోజుల్లో తుని మండలానికి పుష్కర జలాలు చేరుతాయి. పంపా రిజర్వాయర్‌కు నీరు మళ్లించి తొండంగి, తుని మండలాలకు సాగునీరు అందిస్తాం. – డి.సూర్యనారాయణ, పుష్కర ఏఈ. తుని -
సేకరణ.. సవాల్..!
సాక్షి,భువనగిరిఅర్బన్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్‌కు భూ సేకరణ చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. భూ సేకరణ కోసం వస్తున్న అధికారులను నిర్వాసితులు అడ్డుకుంటుండడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. బస్వాపురం మినహా మరెక్కడా భూ సేకరణ పూర్తి కాలేదు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లిం చాలని, దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.సేకరించిన భూ మిలో చేపట్టిన పనులను ఇటీవల బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన నిర్వాసితులు అడ్డుకున్నారు. అంతేకాకుండా గ్రామస్తులు పరిహారంపై తేల్చాలంటూ దీక్షలకు దిగారు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం : 33.39 టీఎంసీలు కావాల్సిన భూమి : 3,970 భువనగిరి మండలంలో... బీఎన్ తిమ్మాపురంలో 1,490 ఎకరాలు బస్వాపురంలో 1,100 ఎకరాలు వడపర్తిలో 430 ఎకరాలు యాదగిరిగుట్ట మండలంలో... లప్పనాయక్‌తండాలో 500 ఎకరాలు తుర్కపల్లి మండలంలో.. విర్యతండా, చౌక్లతండా, కొక్యతండాల్లో 450 ఎకరాలు ఇదీ పరిస్థితి.. బస్వాపురంలో 11.39 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం 3,970 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్ నిర్మాణంలో భువనగిరి మండలంలోని బస్వాపురం, బీఎన్ తిమ్మాపురం, యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్‌తండా, తుర్కపల్లి మండలంలోని పిర్యాతండా, చౌక్లతండా, కొక్యతండా గ్రామాలకు చెందిన రైతులు తమ భూములు కొల్పోతున్నారు. కాగా భువనగిరి, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలో కొన్ని గ్రామాల్లో అధికారులు భూసేకరణ కోసం సర్వే చేశారు. సర్వే చేసిన అనంతరం రెవెన్యూ అధికారులకు నివేదికలు అందజేశారు. రైతులు ఏమంటున్నారంటే.. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను రిజర్వాయర్ కోసం వదులుకోవాల్సి వస్తుందని బీఎన్ తిమ్మాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కోరిన విధంగా పరిహారం ఇప్పించాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని బీఎన్ తిమ్మాపురం ముంపు బాధితులు దీక్షలు చేపట్టారు. అంతేకాకుండా రిజర్వాయర్ పనులను ఇటీవల అడ్డుకున్నారు. తల్లిదండ్రుల నుంచి తమకు వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటున్నాం.. భూములు కోల్పోతే తాము జీవనాధారం ఉండదని వారు ఆందోళన చెందుతున్నారు. భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇవ్వాలని బీఎన్ తిమ్మాపురం నిర్వాసితులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం ఎకరానికి రూ.50లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల 300మంది రైతులు రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. బస్వాపురంలో సర్వే పూర్తి.. బస్వాపురం గ్రామానికి చెందిన 520 మంది రైతులకు సంబంధించిన 1,100 ఎకరాల భూమిలో రిజర్వాయర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 123 ర్టో ప్రకారం ఎకరానికి నష్ట పరిహారం రూ. 13.90లక్షలు ఇస్తుంది. దీనికి రైతులు అంగీకరించడంతో పనులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన రూ. 50కోట్లు బ్యాంకులో ఉన్నాయి.మిగిలిన వడపర్తి, విర్యతండా, చౌక్లతండా, కొక్యతండాలో, లప్పనాయక్‌తండాలో భూ సేకరణకోసం సర్వే చేయాల్సి ఉంది. బీఎన్ తిమ్మాపురం గ్రామస్తుల డిమాండ్లు ఇవీ.. ఎకరానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలి ఇల్లుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి చదువుకున్న వ్యక్తులు ఉంటే ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం కల్పించాలి చదువుకోని వారికి ఉపాధిహామీ అవకాశం కల్పించాలి ముంపునకు గురవుతున్న రైతులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలి హామీ ఇచ్చిన తర్వాతే సర్వే చేయాలి. దీక్ష చేస్తున్న బీఎన్ తిమ్మాపురం ముంపు బాధితులు పరిహారంపై స్పష్టత ఇవ్వాలి భువనగిరిఅర్బన్ :బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంపై స్పష్టత ఇవ్వాలని ముంపు బాధితులు డిమాండ్ చేశారు. పరిహారం కోసం బీఎన్‌తిమ్మాపురం బాధితులు చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారం నా టికి 11వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్ష ల నిర్వాహకుడు వల్దాస్ రాజు మాట్లాడుతూ.. భూములు కొల్పోయే రైతులకు నష్ట పరిహారం గురించి తెలియజేయాలన్నారు. మాకు న్యాయం జరిగే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. దీక్షలో రాములు, రాజిరెడ్డి, చిక్కుడు బాలకృష్ణ, నర్సింహ్మ, భాస్కర్, ఈశ్వరమ్మ, కమలమ్మ, మం గమ్మ, వెంకటేష్ పాల్గొన్నారు. స్పష్టమైన హామీ ఇస్తలేరు ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఎకరానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలి. స్పష్టమైన హామీని అధికారులు ఇవ్వడం లేదు. –రావుల నందు, రైతు బీఎన్‌తిమ్మాపురం జీవనాధారం చూపించాలి మాకు జీవనా ధారం చూపిం చాలి. సర్వే చేసిన భూమికి ఎంత రేటును కట్టిస్తారో చెప్పాలి. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. నా కుటుంబం దీనిపైనే ఆధారపడి బతుకుతున్నం. – భూక్య పిక్లానాయక్, పిర్యాతండా, తుర్కపల్లి మండలం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి చదువుకున్న ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. కుటుంబసభ్యులకు ఉపాధిహామీ పనులు కల్పించాలి. కోత్పోతున్న భూములకు మళ్లీ ఎక్కడ ఇస్తారో చెప్పాలి. నష్టపోకుండా చూడాలి. –దిరవాత్ నరేష్‌నాయక్, లప్పనాయక్‌తండా, యాదగిరిగుట్ట మండలం -
ఎక్కువ సంఖ్యలో రిజర్వాయర్లు తప్పనిసరి
కాంగ్రెస్ ప్రజెంటేషన్‌పై స్పందించిన రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నీటి నిల్వకు, వినియోగానికి రిజర్వాయర్లు అవసరం అందుకే కాళేశ్వరం, పాలమూరులో అధిక సామర్థ్యంతో చేపడుతున్నారు సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా పరీవాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటి చుక్కను మళ్లించడం.. అవసరాలకు తగ్గట్టుగా నిల్వ, వినియోగం కోసం రిజర్వాయర్ల నిర్మాణం తప్పనిసరని సాగునీటి శాఖ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం స్పష్టం చేసింది. సాగు, తాగు, విద్యుత్, ఇతర అవసరాలకు నీటిని అందుబాటులో ఉం చడానికి.. రెండో పంటకు నీరందించాలంటే నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ల అవసరం ఎక్కువని పేర్కొంది. అందువల్లే ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఎక్కువ రిజర్వాయర్లను ప్రతిపాదించిందని తెలిపింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సాంబయ్య, సత్తిరెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజెంటేషన్‌లో చెప్పిన అంశాలను వారు తప్పుపట్టారు. 148మీటర్ల ఎత్తులో నీటి లభ్యత 40 టీఎంసీలే ప్రాణహిత -చేవెళ్ల పథకంలో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత పుష్కలంగా లేనందునే మేడిగడ్డ నుంచి నీటిని తీసుకునే కాళేశ్వరం పథకాన్ని ప్రభుత్వం మొదలుపెట్టినట్లు రిటైర్డ్ ఇంజనీర్లు స్పష్టం చేశారు. ‘‘తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో 160 టీఎంసీల లభ్యత ఉంటుంది. అందులో 75 డిపెండబులిటీ లెక్కన 120 టీఎంసీలను తీసుకోవచ్చు. కానీ ఎత్తును 148 మీటర్లకు తగ్గిస్తే లభ్యమయ్యే నీరు 40 టీఎంసీలే. అందువల్లే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. మేడిగడ్డ వద్ద 240 టీఎంసీల నికర జలాలతో పాటు 120 టీఎంసీల మిగులు జలాలు లభ్యతగా ఉన్నాయి. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు గోదావరి పరీవాహకాన్నే వాడుకుంటున్నందున ముంపు ఉండదు. ఇదే సమయంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డల ద్వారా 30 టీఎంసీల అదనపు నిల్వకు అవకాశం ఏర్పడింది..’’ అని వారు వివరించారు. ఇక తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తెచ్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రిని కోరామని, దానిపై ఆయ న సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. పైప్‌లైన్ వ్యవస్థపై అధ్యయనం ప్రతి నీటి చుక్కను వినియోగంలోకి తెచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని పరిశీలించాలని తాము సూచించగా ప్రభుత్వం సమ్మతించిందని రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు. కాల్వలతో పోలిస్తే పైప్‌లైన్ నిర్మాణ ఖర్చు తక్కువగా ఉండడం, ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలు, నీటి ఆదా నేపథ్యంలో దానికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. భూసేకరణ అవసరం తక్కువగా ఉంటుందని వివరించారు. ఈ విధానాన్ని పాలమూరు, డిండి ప్రాజెక్టుల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉన్న మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర డ్యామ్‌ను ప్రతిపక్ష నేత జానారెడ్డి సందర్శించి.. పైప్‌లైన్ వ్యవస్థను స్వాగతించారని పేర్కొన్నారు.