Residential Zone
-
మా బతుకులు మమ్మల్ని బతకనీయండి
రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై రైతుల అభ్యంతరం పునాదిపాడుని రెసిడెన్షియల్ జోన్లోనే ఉంచాలంటూ వినతి పునాదిపాడు (కంకిపాడు) : రాజధాని మాస్టర్ ప్లాన్‌తో మా బతుకుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. మాస్టర్ ప్లాన్‌లో మార్చండి...రెసిడెన్షియల్ జోన్‌గా కొనసాగించి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి...అంటూ పునాదిపాడు రైతులు తహశీల్దార్‌కు విజ్ఞప్తిచేశారు. పునాదిపాడు పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో పునాదిపాడు, గొల్లగూడెం గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతు ప్రతినిధులు మద్దాలి తిరుమలరావు, మద్దాలి సాయిబాబు తదితరులు మాట్లాడుతూ గ్రామంలో 1686 ఎకరాల ఆయకట్టులో 650 ఎకరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు ఏర్పడ్డాయన్నారు. 1036 ఎకరాల్లో సాగు జరుగుతుందన్నారు. 2008 ఉడా మాస్టర్ ప్లాన్‌లో జీవో నెంబరు 387 ప్రకారం పునాదిపాడుతో సహా ఉయ్యూరు వరకూ రెసిడెన్షియల్ జోన్‌గా ప్రకటించారన్నారు. స్టాంపు డ్యూటీ రూ 50 లక్షలకు పెంచారన్నారు. చెన్నై-విశాఖ కారిడార్‌లో కంకిపాడు క్లస్టరులో 3200 ఎకరాలు పేర్కొంటూ కేంద్రం వద్ద జాబితాలు ఉన్నాయని, కారిడార్ పేరుతో ఇళ్లు, పొలాలు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో పొలాలు తీసుకుని నామ మాత్రపు పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. అగ్రికల్చర్ జోన్ 1లో గ్రామాన్ని చేర్చటం వల్ల అభివృద్ధిలో వెనుకబడి పోతుందన్నారు. కొనుగోలుదారులు లేక, భూమిని నమ్ముకున్న రైతులు ఇబ్బందులో పడే ప్రమాదం ఉందన్నారు. తహశీల్దార్‌కు వినతి రైతులు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్ రోజాకు వినతిపత్రాన్ని అందించారు. రైతులు మాట్లాడుతూ సొంత పొలాల్లో రైతులు ఇళ్లు కట్టుకోవాలంటే అనుమతులు ఎలా ఉంటాయో వివరించాలని కోరారు. రైతులు నష్టపోకుండా పునాదిపాడు గ్రామాన్ని రెసిడెన్షియల్ జోన్ గా కొనసాగించాలని విజ్ఞప్తిచేశారు. రైతుల వినతులపై స్పందించిన తహశీల్దార్ రోజా మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా రైతుల నుంచి వచ్చిన అభ్యర్థలను పరిశీలించి సీఆర్డీఏకు నివేదిక పంపుతామన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచి జంపని వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచి ముసిబోయిన వెంకటేశ్వరరావు, రైతు ప్రతినిధులు పీ.సుగుణమూర్తి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, అనుమోలు శ్రీను, ఆర్.నాగేంద్రబాబు, యార్లగడ్డ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడికి స్థలమే ముఖ్యం
స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే స్థలం మీద మదింపు చేయడమే ఉత్తమం. దీర్ఘకాలం వేచి చూడగలిగితే అధిక రాబడిని అందుకోవచ్చు. నాణ్యమైన నిర్మాణాల్ని అందించాలని ఎలాగూ ప్రభుత్వాలూ భావిస్తున్నాయి కాబట్టి.. గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గదు. -సాక్షి, హైదరాబాద్ ముందుగా మీరు స్థలంపై ఎంత పెట్టుబడి పెట్టగలరనే విషయంపై ఓ అవగాహనకు వచ్చాక.. ఆ తర్వాత ఎక్కడ కొనాలో నిర్ణయించుకోండి. ఇప్పుడు కాకపోయినా ఓ పదేళ్లయ్యాకైనా స్థలం విలువ రెట్టింపయ్యే అవకాశం గల ప్రాంతాన్ని ఎంచుకోండి. ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఆస్కారమున్న ప్రాంతాలైతే మరీ మంచిది. హెచ్ఎండీఏ లాంటి స్థానిక సంస్థలు తరచూ వేలం పాటలను నిర్వహిస్తాయి కాబట్టి వీలుంటే ఓ సారి కనుక్కోండి. క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించే మీ బ్యాంకు ఆమోదం ఉన్న లే అవుట్లు ఉన్నాయోమో ఓసారి ఆరా తీయండి. దేని పరిధిలో ఉందో: మీరు కొనాలనుకున్న స్థలం దేని పరిధిలోకి వస్తుంది? అంటే రెసిడెన్షియల్ జోన్ కిందికొస్తుందా? కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తుందా? అనే విషయాల్ని తెలుసుకోవాలి. హెచ్ఎండీఏ బృహత్ ప్రణాళిక ప్రకారం.. దాదాపు ఆరు వేల కిలో మీటర్లు విస్తరించిన హుడా ఎక్స్టెండెడ్ ఏరియాను 12 స్థల వినియోగ జోన్లుగా వర్గీకరించారు. ఏ స్థలం ఏయే జోన్ పరిధిలోకి వస్తుందో తెలియని పరిస్థితి. హెచ్ఎండీఏ అధికారుల్ని అడిగినా సరైన సమాధానం రాకపోవచ్చు. రిక్రియేషన్ జోన్ పరిధిలోని స్థలం కొని విశాలమైన ఇల్లు కట్టుకుంటానంటే కుదరదు. కాబట్టి, ఈ విషయంలో ముందే అవగాహనకు రండి. ధర తెలుసుకోండి: మాంద్యం తర్వాత మార్కెట్లో 30 శాతం స్థలాల ధరలు తగ్గుముఖం పట్టాయి. మీరు ఎంపిక చేసుకున్న ప్లాటులో ప్రస్తుతం ధరెంత చెబుతున్నారు? బూమ్ సమయంలో ధర ఎంతుందో బేరీజు వేయండి. ఆ తర్వాత సదరు సంస్థ నుంచి స్థలం పత్రాలు, టైటిల్ డీడ్, పన్ను రశీదులు తీసుకోండి. వాటిని లాయర్‌తో పరిశీలింపజేయండి. స్థానిక సంస్థల నుంచి స్థలం కొనాలని భావిస్తే బేరమాడే అవకాశముండదు. అదే ప్రైవేటు సంస్థలనుకోండి.. మీరు ఎంత దాకా పెట్టగలరో సూటిగా చెప్పొచ్చు. ధర విషయంలో మీరో నిర్ణయానికి రాగానే.. సంస్థ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము ముందు చెల్లించండి. మిగతా మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో వివరించండి. రిజిస్ట్రేషన్ మీ పేరునే: మీరు సొమ్మంతా కట్టేశాక.. స్థలాన్ని మీ పేరిట రిజిస్టర్ చేసుకోండి. ఖాళీగా ఉన్న ప్రాంతంలో కొంటే ముందుగా పునాది వేసుకోండి. వీలైతే గోడ కూడా కట్టేయండి. కబ్జా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా స్థలంపై దృష్టి సారించాలి. నగరంలోని పలు లే-అవుట్లివే.. ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. శ్రీశైలం హైవే లోని కర్తాల్‌లో 3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్ బటర్ ఫ్లై సిటీ’ని నిర్మిస్తోంది. ఇందులో 2 వేల ఎకరాలు పూర్తిగా లే-అవుట్లే. ధర గజానికి రూ.3 వేలు. విజన్ ఇండియా సంస్థ భువనగిరిలో 15 ఎకరాల్లో ‘విజన్ కౌంటీ’ గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోంది. ఇదే సంస్థ బెంగళూరు హైవేలోని కొత్తూర్‌లో 18.5 ఎకరాల్లో ‘విజన్ ప్యారడైజ్’ పేరుతో మరో గేటెడ్ కమ్యూనిటీని కూడా చేస్తోంది. దీనికి దగ్గర్లోనే మరో 50 ఎకరాల్లో విజన్ ప్రైడ్‌ను కూడా రానుంది. త్వరలోనే షాద్‌నగర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి ఆనుకొని 70 నుంచి 100 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మెట్రోసిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ బొంగ్లూరు ఓఆర్ఆర్ వద్ద 20 ఎకరాల్లో మెట్రోసిటీ ఇన్ఫ్రాటెక్ ఫేజ్-2ను ప్రారంభించింది. గజం ధర రూ.5,500. ఇదే సంస్థ ఆదిభట్ల టీసీఎస్ వెనుక ప్రాంతంలో 20 ఎకరాల్లో కొత్త వెంచర్‌ను కూడా వేస్తోంది. గజం ధర రూ.18-20 వేలు. సాయి బాలాజీ ఎస్టేట్స్ గున్‌గల్‌లో 30 ఎకరాల్లో శ్రీ బాలాజీ నగర్‌ను నిర్మిస్తోంది. గజం ధర రూ.4 వేలు.