Retired constable
-
ఇంజక్షన్ వికటించి.. రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి
హసన్‌పర్తి: ఇంజక్షన్ వికటించి ఓ రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన హసన్‌పర్తి మండల కేంద్రంలో జరిగింది. చింతగట్టుకు చెందిన రిటైర్డ్ కానిస్టేబుల్ నద్దునూరి సారయ్య(65) చికిత్స నిమిత్తం సోమవారం మండల కే ంద్రంలోని ‘శంకర్’ ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్.. సారయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రెండు ఇంజక్షన్లు ఇవ్వగా సారయ్య ఒకసారిగా కుప్పకూలారు. దీంతో సారయ్యను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రిస్కిప్షన్ ఇవ్వమని.. ఇదిలా ఉండగా సారయ్యకు ప్రథమ చికిత్స సందర్భంగా ఉపయోగించిన మందుల ప్రిస్కిప్షన్ ఇవ్వాలని 108 సిబ్బంది.. వైద్యుడి శంకర్‌ను కోరారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న మృతుడి కుమారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్ శంకర్‌పై దాడికి దిగారు. అనంతరం డాక్టర్ శంకర్‌ను అంబులెన్స్‌లో ఎంజీఎంకు తీసుకెళ్లారు. కాగా, ఎంజీఎంలో సారయ్యను పరీక్షించిన వైద్యులు.. అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే సారయ్యకు పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో వైద్యుడు శంకర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సారయ్య కుమారుడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపి తెలిపారు. జిల్లా వైద్యాధికారుల విచారణ ఇంజక్షన్ వికటించి మృతి చెందిన ఘటనపై డిప్యూటీ డీఎంహెచ్ఓ మధన్మోహన్, సీఐ గోపి విచారణ చేపట్టారు. ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. సారయ్యకు ఇచ్చిన ఇంజక్షన్‌పై ఆరా దీశారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కాలం చెల్లిన ఇంజక్షన్లు, మందులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి నిర్వహణ ఆస్పత్రి నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని డిప్యూటీ డీఎంహెచ్ఓ మధన్మోహన్ తెలిపారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదునెలల క్రితం ఇంజక్షన్ వికటించి ఓ బాలుడు మృతి చెందడంతో ఆస్పత్రి సీజ్ చేసినట్లు తెలిపారు. ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే అక్రమంగా ఆస్పత్రి నిర్వహిస్తున్నారని చెప్పారు. కాగా, ఐదు నెలల క్రితం ఆస్పత్రి సీజ్ చేసినా సేవలు కొనసాగిస్తున్న డాక్టర్ శంకర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రి సీజ్ ‘శంకర్’ ఆస్పత్రిని సీజ్ చేశారు. తహసీల్దార్ ప్రసాద్, డీటీ రహీం, ఆర్ఏ ప్రణయ్.. ఆస్పత్రికి సీల్ వేశారు. వైద్యాధికారులు వాణిశ్రీ, విజమ్రావు, ఏఎస్వో ప్రసన్నకుమార్, హెల్త్ అసిస్టెంట్లు కందుకూరి సంతోష్‌కుమార్, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఒకరితో ప్రేమ...మరొకరితో పెళ్లి!
ఓ రిటైర్డు కానిస్టేబుల్ కుమారుడి బాగోతం సాక్షి ప్రతినిధి,కడప : వాళ్లిద్దరూ ఒకే కళాశాలలో చదవడంతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ యువతి నమ్మింది. ప్రస్తుతం ఆ యువకుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలియడంతో ఆ యువతి జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు యువకుడిపై కేసు నమోదైంది. కడప నగరం రవీంద్రనగర్‌కు చెందిన ఓ యువతికి ప్రొద్దుటూరులోని రాజేశ్వరినగర్లో నివాసముంటున్న పఠాన్ ఇమ్రాన్‌కు మధ్య కొన్నేళ్ల నుంచి ప్రేమాయణం నడుస్తోంది. కడపలో చదువుతున్న సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చి, జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుందామని వాళ్లిద్దరి మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. కొన్ని రోజుల తర్వాత యువతికి టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆమె ప్రస్తుతం ప్రొద్దుటూరులోని మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఇమ్రాన్‌ఖాన్ కూడా అక్కడే ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. కట్నం కోసం మరో పెళ్లికి సిద్ధం.. ఇమ్రాన్‌ఖాన్‌కు ఇటీవల రూ. 10 లక్షలు నగదుతో పాటు సుమారు 40 తులాలకు పైగా బంగారు కట్నంగా ఇస్తామని రాజంపేట నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. కుమారుడు కడపకు చెందిన యువతిని ప్రేమించిన విషయం తెలిసినప్పటికీ అతని తండ్రి జాఫర్‌ఖాన్( రిటైర్టు కానిస్టేబుల్) రాజంపేట సంబంధానికి అంగీకారం తెలిపాడు. ఈ క్రమంలో ప్రేమ వ్యవహారం వెలుగు చూసినా పట్టించుకోలేదు. అనుకున్నట్టే రాజంపేటలో కుమారుడికి సంబంధం కుదుర్చుకున్నాడు. అంతేకాదు ఈ నెలలోనే పెళ్లి కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. యువతి ఫిర్యాదుతో ఇమ్రాన్‌ఖాన్‌పై కేసు.. ఇమ్రాన్‌ఖాన్ తనను మోసం చేశాడని గ్రహించిన యువతి న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి వివిరించింది. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో పఠాన్ ఇమ్రాన్‌ఖాన్, తండ్రి జాఫర్ఖాన్లపై కేసు నమోదైంది. ఈ మేరకు ప్రొద్దుటూరు పోలీసులు అతన్ని రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తండ్రి మాట కాదనలేక వేరే యువతితో వివాహం చేసుకుంటున్నట్లు స్వయంగా ఇమ్రాన్ అంగీకరించినప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారని యువతి ఆరోపిస్తోంది. కాగా ఇమ్రాన్‌ఖాన్‌ను వదలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె చెబుతోంది. తనలా మరే అమ్మాయి మోసపోరాదని, అందుకోసం ఎంత వరకైనా న్యాయపోరాటం చేస్తానని పేర్కొంటోంది.