ఏపీఐఐసీ భూములపై ‘పచ్చ’ డేగలు
సీఎం సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. భూ కబ్జాల పరంపరను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వారి ఆగడాలకు అడ్డేలేకుండా పోతోంది. ప్రభుత్వ భూములు, చెరువులనే కాదు.. శ్రీకాళహస్తి మండలంలో ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కి అప్పగించిన భూములనూ వదలలేదు. జేసీబీ పెట్టి చదును చేస్తున్నారు. గట్లు వేసి దున్నకాలకు సిద్ధమయ్యారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
- సువూరు 40 ఎకరాల ఆక్రవుణ
- ఆక్రమిత భూమి విలువ రూ.6 కోట్లకు పైమాటే
- సూత్రధారి ఓ వీఆర్వో!
శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలం మన్నవరం భెల్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వెలంపాడు గ్రామం ఉంది. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని 178, 185 బ్లాక్లో 225 ఎరకరాల ప్రభుత్వ భూమి ఉంది. అదేవిధంగా ఇనగలూరు రెవెన్యూ పరిధిలో 181వ బ్లాక్లో 165 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై వెలంపాడు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయుకుడు కన్నుపడింది. బ్లాక్ నంబర్ 178లో దామరాకుల గుంట నుంచి మామిడిగుంటకు వెళ్లే దారిలో 20 ఎకరాలు, అదే బ్లాక్లో రేపల్లికండ్రిగ చెరువు వద్ద 20 ఎకరాలు ఆక్రమించేశాడు. జేసీబీతో చదును చేసి తమ ఆధీనంలో ఉంచుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఆక్రమిత భూమి విలవ రూ.6 కోట్లు పైమాటే. ఏపీఐఐసీకి అప్పగించారని తెలసినా ఖాతరు చేయులేదు. వారం రోజుల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాడు.
రెవెన్యూ అధికారి అండతోనే!
టీడీపీ నాయకుడు ఆక్రమించిన భూమికి సమీపంలోనే మన్నవరం పరిశ్రమ ఉంది. ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడి భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఆ టీడీపీ నాయకుడు పావులు కదిపాడు. ఓ వీఆర్వోని బుట్టలో వేసుకుని తమ పని యథేచ్ఛగా సాగిస్తున్నాడు. ఆక్రమిత భూమిని సాగు భూమిలాగ మార్చివేస్తే అనుభవం కింద వస్తుందని ఆ రెవెన్యూ అధికారి ఆ ‘పచ్చ’డేగకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ లోపు రియుల్ వ్యాపారులు వస్తే వారికి విక్రరుంచడమో లేపోతే ఏపీఐఐసీ వాళ్లు వస్తే అనుభవంలో ఉంది కాబట్టి ఎకరాకు రూ.5 లక్షల వంతున నష్టపరిహారం చెల్లించమని డివూండ్ చేయువచ్చని ఆ అధికారి టీడీపీ నాయకుడికి చెప్పినట్లు సమాచారం.