రెవెన్యూ శాఖలో 6 వేల పోస్టుల భర్తీ: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో ఆరు వేల పోస్టుల భర్తీకి సత్వర చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పోస్టులు 4,305, గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టులు 1,657 భర్తీకి తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఈ నెల 4న ప్రభుత్వం జీవో జారీ చేసినందున సత్వరమే నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు ప్రాథమికంగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని, వచ్చే వారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలపై సమగ్రంగా చర్చించి ఖరారు చేద్దామని సూచించారు.