రెవెన్యూ శాఖ లో ఆరు వేల పోస్టుల భర్తీకి డిసెంబ ర్‌లోపు నోటిఫికేషన్లు జారీ చేయాలని మంత్రి రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. వీఆర్‌ఏ పోస్టులు 4,305, వీఆర్‌వో పోస్టులు 1,657 భర్తీకి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ‘అన్ని జిల్లాల్లో ఒకేరోజు పరీక్షలు నిర్వహించాలి. ప్రతిభ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి’ అని మంత్రి ఆదేశించారు. పోస్టుల భర్తీకి గతంలో అనుసరించిన విధానమే పూర్తిగా అనుసరించాలని సూచించారు.