గోల్డెన్ గ్లోబ్స్ లో మెరిసిన 'బోయ్ హుడ్'
లాస్ ఏంజిల్స్: గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో 'బోయ్ హుడ్' మూవీ మెరిసింది. 72వ వార్షికోత్సవాల్లో భాగంగా బోయ్ హుడ్ చిత్రం రెండు కేటగిరీల్లో గౌరవం దక్కించుకుని ఆస్కార్ అవార్డుకు పరుగులు తీస్తోంది. ఈ చిత్ర దర్శకుడు రిచర్డ్ లింక్ లేటర్ కు ఉత్తమ దర్శకుడి కేటగిరీలో అవార్డు దక్కగా, తల్లి పాత్రకు జీవం పోసిన పాట్రిసి ఆర్కిటీ సహాయ నటి కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది.
దీనిపై దర్శకుడు లింక్ లేటర్ మాట్లాడుతూ.. ఇది తన వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉండటమే కాకుండా.. చాలా మంది నిజజీవితంలో చోటు చేసుకునే సంఘటనలకు ఈ చిత్రం అద్దం పడుతుందన్నారు.