మహారాష్ట్రలో హైదరాబాద్ ట్రెక్కర్ మృతి
హైదరాబాద్: ట్రెక్కింగ్ కోసం మహారాష్ట్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ట్రెక్కర్ రిచిత గుప్త ప్రమాదవశాత్తు మరణించారు. కుటుంబీకులకు సమాచారం లేకుండా ఒంటరిగా ట్రెక్కింగ్‌కు వెళ్లిన రిచితకు సంబంధించి నారా యణగూడ ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె ముంబై వెళ్లినట్టు గుర్తించారు. పన్వేల్ సమీపంలోని ప్రముఖ ట్రెక్కింగ్ ప్రాంత మైన ప్రబల్‌గఢ్ కోట సమీపంలో రిచిత మృతదేహం మంగళ వారం లభించింది. ప్రాథమిక ఆధారాలు, మృతదేహం పడున్న స్థితుల్ని అధ్యయనం చేసిన పోలీసులు ప్రమాదంగా తేల్చారు.
హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన రిచితకు ఐదేళ్లక్రితం వ్యాపారవేత్త అమిత్ కనోడియాతో వివాహమైంది. రిచిత సెప్టెంబర్‌లో కొందరితో కలసి ప్రబల్‌గఢ్ కోట సమీపంలోని కళావంతిన్ దుర్గ్ కొండను అధిరోహించారు. గతనెల 25న మరోసారి ఒంటరిగా ట్రెక్కింగ్‌కు బయలుదే రిన రిచిత.. హైదరాబాద్ నుంచి విమానంలో ముంబై వెళ్లారు. ముంబై విమానాశ్రయం నుంచి ట్యాక్సీలో పన్వేల్ తాలూకాలోని ఠాకూర్‌వాడికి చేరుకున్నారు. ప్రబల్‌గఢ్ కోట సమీపంలోని 2,100 మీటర్ల ఎత్తయిన కొండను ఎక్కడానికి సిద్ధమైన రిచిత అక్కడ నుంచే తన లోకేషన్‌ను దుబాయ్‌లో ఉన్న భర్త అమిత్‌కు వాట్సాప్‌లో షేర్ చేశారు. గత నెల 29నే రిచిత తిరిగి రావాల్సి ఉండగా.. రాకపోవడంతో ఈ నెల మొదటివారంలో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో గత నెల 25న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ముంబై వెళ్లినట్టు గుర్తించారు. ముంబై విమానాశ్రయంలో ఫుటేజ్ ద్వారా ఆమె ప్రయాణిం చిన ట్యాక్సీ డ్రైవర్‌ను గుర్తించారు. అతడిని విచారించగా.. రిచితను ఠాకూర్వాడిలో దించినట్లు చెప్పారు. అమిత్‌కు పంపిన లోకేషన్ ఆధారంగా హైదరాబాద్, పన్వేల్ పోలీసు లు కోటలో గాలింపు చేపట్టగా వెనుక భాగంలోని కొండకు 600 మీటర్ల దిగువలో రిచిత మృతదేహం లభించింది. 4 రోజుల క్రితమే మరణించినట్లు నిర్ధారించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రిచిత పర్సు, సెల్‌ఫోన్ ఇతర సామగ్రిని కొండ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు.